Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రోమియో జూలియట్ మ్యూజికల్ డ్రామాలో వరలక్ష్మీ శరత్ కుమార్

సినీ నటుడు శరత్ కుమార్, విశాల్ గర్ల్ ఫ్రెండ్‌గా పిలవబడుతున్న వరలక్ష్మీ రూటు మార్చింది. తమిళంలో శింబు సరసన పోడాపోడీ సినిమాలో తెరంగేట్రం చేసిన వరలక్ష్మి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. తమిళ, మల

Advertiesment
Varalakshmi Sarathkumar
, శనివారం, 1 జులై 2017 (18:01 IST)
సినీ నటుడు శరత్ కుమార్, విశాల్ గర్ల్ ఫ్రెండ్‌గా పిలవబడుతున్న వరలక్ష్మీ రూటు మార్చింది. తమిళంలో శింబు సరసన పోడాపోడీ సినిమాలో తెరంగేట్రం చేసిన వరలక్ష్మి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. తమిళ, మలయాళ సినిమాల్లోనూ నటిస్తోంది. తాజాగా వరమ్మ మ్యూజికల్ డ్రామాలో కనిపించనుంది. సినిమా షూటింగ్‌ల్లో సీన్ తప్పైతే మళ్లీ మరో టేక్ చేసుకోవచ్చునని.. కానీ ఇలాంటి డ్రామాల్లో రెండో టేక్ పోలేమని వరలక్ష్మి చెప్పింది. 
 
త్వరలో రోమియో జూలియట్ అనే మ్యూజికల్ డ్రామాలో కనిపించనున్నట్లు వెల్లడించింది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ అంగీకారంతో ఆయన పాటలకు ఈ డ్రామాలో నృత్యం చేయడం జరుగుతుందని.. తనతో పాటు సల్సా మనో డ్యాన్స్ చేస్తాడని వరలక్ష్మి వెల్లడించింది. 
 
జెఫ్రీ వరదన్ దర్శకత్వంలో ఈ మ్యూజికల్ డ్రా జూలై 8, 9 తేదీల్లో చెన్నైలో జరుగనుంది. పాపులర్ షేక్‌స్పియర్ రోమియో జూలియట్‌గా మ్యూజికల్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రోగ్రామ్‌లో దాదాపు 10 సాంగ్స్ వుంటాయి. ఈ షోకు మంచి ఆదరణ లభిస్తే పలు ప్రాంతాల్లో ఇలాంటి మ్యూజికల్ డ్రామాలు చేసేందుకు వరలక్ష్మి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జబర్ధస్త్‌లో ఇక నాగబాబు కనిపించరా?