ఓటీటీలో వకీల్ సాబ్.. ఆ తర్వాత అరణ్య, నిశ్శబ్దం

శనివారం, 23 మే 2020 (15:29 IST)
లాక్‌డౌన్ కారణంగా రెండు నెలల పాటు థియేటర్స్ మూతపడిన సంగతి తెలిసిందే. ఫలితంగా నిర్మాతలందరూ ఓటీటీలను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే ఓటీటీలో విడుదల కానున్న కొన్ని చిత్రాలకి సంబంధించి రిలీజ్ డేట్‌లు కూడా ప్రకటించారు. 
 
అయితే శుక్రవారం సీఎం కేసీఆర్‌తో పలువురు సినీ ప్రముఖులు చర్చలు జరిపిన తర్వాత థియేటర్స్ రీ ఓపెన్‌పై కాస్త స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. ఆగస్టులో తిరిగి థియేటర్స్ ఓపెన్ అవుతాయనే ఓ ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో ముందుగా వచ్చే సినిమా పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ అని అంటున్నారు. 
 
దాదాపు రెండేళ్ళ తర్వాత పవన్ తిరిగి మేకప్ వేసుకోగా, ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ తర్వాత వి, అరణ్య, నిశ్శబ్దం వంటి బడా చిత్రాలు కూడా ప్రేక్షకుల ముందుకు ఒక్కొక్కటిగా రానున్నాయి.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం సీనియర్ నటి వాణిశ్రీ కుమారుడు గుండెపోటుతో కన్నుమూత