బాలీవుడ్ హీరోయిన్ వాణీ కపూర్‌ను కరోనా కాటేసింది. దీంతో ఆమె పాల్గొంటూ వచ్చిన చిత్ర షూటింగును నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని నియంత్రించేందుకు వీలుగా కేంద్రం గత మార్చి మూడో వారం నుంచి లాక్డౌన్ అమలు చేసింది. ఆ తర్వాత జూలై నుంచి కరోనా లాక్డౌన్ ఆంక్షలను సడలిస్తూ వచ్చింది.
ఈ క్రమంలో ఇటీవలే షూటింగులకు అనుమతి కూడా ఇచ్చింది. దీంతో పలు జాగ్రత్తల నడుమ మూవీ షూటింగులు జరుగుతున్నాయి. అయినప్పటికీ... పలుచోట్ల నటీనటులు కరోనా వైరస్ బారినపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ నటి వాణీకపూర్ కరోనా వైరస్ బారినపడ్డారు. ఆమెకు నిర్వహించిన నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది.
ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానా, వాణీ కపూర్ కాంబోలో ఓ సినిమా రానుంది. ఈ చిత్రం షూటింగ్ ఛండీగఢ్‌లో షురూ కావాల్సి ఉంది. అయితే వాణీకపూర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది.
దీంతో షూటింగ్ మొదలు పెట్టాలనుకున్న డైరెక్టర్ అభిషేక్ కపూర్ అండ్ టీం డైలామాలో పడింది. కొన్ని లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయగా వాణీకపూర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉంది. కానీ అభిషేక్, ఆయుష్మాన్ ఖురానా కొన్ని రోజులు క్వారంటైన్‌లో ఉంటున్నారు.
వాణీ కపూర్ తిరిగి కోలుకుంటున్నారు. అయితే ఆమె షూట్‌లో జాయిన్ అయే అవకాశాలు లేకపోతే ఆయుష్మాన్ ఖురానా సోలో సీన్లను చిత్రీకరించాలని అభిషేక్ కపూర్ అనుకుంటున్నాడట. రొమాంటిక్ కామెడీ బ్యాక్ డ్రాప్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.