Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హీరో రామ్ చరణ్‌పై ప్రతీకారం తీర్చుకున్న ఉపాసన!

Advertiesment
upasana - cherry
, ఆదివారం, 12 ఫిబ్రవరి 2023 (18:12 IST)
మెగా కోడలు ఉపాసన తన భర్త రామ్ చరణ్‌పై ప్రతీకారం తీర్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకదాన్ని ఆమె షేర్ చేశారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు వారిద్దరి మధ్య వైరం ఎందుకు వచ్చిందో ఓసారి తెలుసుకుందాం. 
 
ఇటీవల అల్లు రామలింగయ్య శతజయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో రామ్ చరణ్, ఉపాసనతో పాటు హీరో సాయి ధరమ్ తేజ్ కూడా పాల్గొన్నారు. ఈ ముగ్గురూ మొదట ఒకే సోఫాలో కూర్చోగా, కాసేపటికి ఉపాసనను చరణ్ వేరే సీటులోకి వెళ్లి కూర్చోమని సరదగా చెప్పి ఆటపట్టించారు. దీనికి రివేంజ్‌గా ఇంటికి వెళ్లా రామ్ చరణ్ పరిస్థితి ఇది అంటూ ఓ నెటిజన్ రివేంజ్ వీడియోను క్రియేట్ చేశాడు. 
 
ఇందులో బట్టలు ఉతకడం, చెట్లకు నీరు పోయడం, ఇల్లు శుభ్రం చేయడం, చివరగా కాఫీ పెట్టి ఉపాసనకు ఇవ్వడం వరకు ఉంది. కరోనా లాక్డౌన్ సమయంలో చరణ్ తన ఇంట్లో ఈ పనులన్నీ చేశారు. ఆ వీడియోను ఇపుడు షేర్ చేసి ఇదే ఉపాసన మేడం రివేంజ్ వీడియో అంటూ షేర్ చేశారు. ఈ ఫన్నీ వీడియోను ఉపాసన స్వయంగా తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేయడంతో ఇది వైరల్ అయింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"కాంతార" సీక్వెల్ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్