Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాహుబలి రివ్యూ అప్పుడే వచ్చేసింది..ఇండియన్ సినిమాల్లో ది బెస్ట్.. యూఏఈ సెన్సార్ బోర్డ్ స్టాండింగ్ ఒవేషన్

రెండు రోజుల తర్వాత రావలసిన బాహుబలి-2 సినిమా రివ్యూ అప్పుడే వచ్చేసిందా.. అదీ భారత్‌లో కాకుండా దుబాయ్‍‌లో ఈ సినిమాపై రివ్యూ చేసేశారా? సెన్సార్ బోర్డ్ సభ్యుడి అత్యుత్సాహం బాహుబలి గుట్టు బయట పెట్టేసిందా.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో బయటకి చెప్పేశారా.

బాహుబలి రివ్యూ అప్పుడే వచ్చేసింది..ఇండియన్ సినిమాల్లో ది బెస్ట్.. యూఏఈ సెన్సార్ బోర్డ్ స్టాండింగ్ ఒవేషన్
హైదరాబాద్ , గురువారం, 27 ఏప్రియల్ 2017 (09:02 IST)
రెండు రోజుల తర్వాత రావలసిన బాహుబలి-2 సినిమా రివ్యూ అప్పుడే వచ్చేసిందా.. అదీ భారత్‌లో కాకుండా దుబాయ్‍‌లో ఈ సినిమాపై రివ్యూ చేసేశారా? సెన్సార్ బోర్డ్ సభ్యుడి అత్యుత్సాహం బాహుబలి గుట్టు బయట పెట్టేసిందా.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో బయటకి చెప్పేశారా... ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం అవును అనే మరి. 
యూఏఈ, యూకే సెన్సార్ బోర్డ్ సభ్యుడు ఉమైర్ సంధు... బుధవారం ఈ సినిమా చూసిన తర్వాత తన ట్వీటర్ ఖాతాలో వరుస ట్వీట్లు చేశారు. 

 
బాహుబలి-2.. ప్రీమియర్ షోలకు మరొక్క రోజు మాత్రమే సమయం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి అభిమానులు సినిమాను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే విషయం తెలుసుకునేందుకే కాకుండా.. ఓ విజువల్ వండర్‌ను సిల్వర్ స్క్రీన్‌పై చూసేందుకు వాళ్లంతా ఆవురావురమంటూ కళ్లప్పగించి మరీ చూస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేలా ఓ సెన్సార్ బోర్డ్ సభ్యుడు వరుస ట్వీట్లు చేయడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమయింది. యూఏఈ, యూకే సెన్సార్ బోర్డ్ సభ్యుడు ఉమైర్ సంధు... బుధవారం ఈ సినిమా చూసిన తర్వాత తన ట్వీటర్ ఖాతాలో వరుస ట్వీట్లు చేశారు. 
 
భారతీయ సినీ పరిశ్రమ నుంచి ఇంతవరకూ చూసిన సినిమాల్లో ‘ది బెస్ట్’ అంటూ బాహుబలి-2 కి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. శుక్రవారం చరిత్ర పున:లిఖించబోతోందని స్పష్టం చేశారు. భారత సినీ చరిత్రలో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన రాజమౌళికి కంగ్రాట్స్ చెప్పారు.

అంతేకాకుండా కట్టప్పను బాహుబలిని ఎందుకు చంపాడో చెప్పాలా..? వద్దా..? అని తన ట్విటర్ ఫాలోవర్స్‌లో పోల్ కూడా పెట్టారు. మొదటి హాఫ్ అద్భుతంగా ఉందనీ, సినిమా నెమ్మదించడం అనే మాట ఎక్కడా లేదని, హాట్సాఫ్‌ టు ప్రభాస్ అని మొదటి ట్వీట్‌తో మొదలు పెట్టిన ఉమైర్.. ఆ తర్వాత సినిమా పూర్తయ్యాక ప్రశంసించకుండా ఉండలేకపోయారు. 
 
సినిమా పూర్తయిన తర్వాత యూఏఈ సెన్సార్ బోర్డ్ అంతా.. స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చిందనీ, భారతీయ సినిమా గర్వించదగ్గ విషయమంటూ చెబుతూ జై హిందూ అని నినదించారు. మొత్తానికి బాహుబలిని ప్రశంసంలతో ముంచెత్తడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమయింది. 
 
ఇదే ఉమైర్ సంధు.. ఏప్రిల్ 17న చేసిన ట్వీట్ బాహుబలి-2 సినిమాపై అంచనాలను మరింత పెంచింది. బాహుబలి-1 కంటే బాహుబలి-2 సినిమా వందరెట్లు బాగుంటుందని ఉమైర్ సందు తేల్చిచెప్పారు. సినిమా ఫలితంపై సినీవర్గాల్లో  అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని ట్వీట్ చేశారు. తెలుగు సినీ పరిశ్రమతోపాటు, ప్రభాస్ అభిమానులు సంబరాలు చేసుకోవాల్సిన సమయం ఆసన్నమయిందని చెప్పారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను నిద్రపోకుండా కథ విన్న సినిమా ఇదే.. ఒళ్లు గగుర్పొడిచింది అంటున్న శివగామి