Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉక్కు సత్యాగ్రహం ఇన్ స్పైరింగ్ గా ఉంది : సీబీఐ మాజీ వీవీ లక్ష్మి నారాయణ

VV Lakshmi Narayana, Satya Reddy, Vennela

డీవీ

, మంగళవారం, 26 నవంబరు 2024 (16:01 IST)
VV Lakshmi Narayana, Satya Reddy, Vennela
విశాఖ ఉక్కు తెలుగు వారి హక్కు నినాదం తో దర్శక, నిర్మాత, హీరో, జనం స్టార్ సత్యారెడ్డి నిర్మాణం లో ప్రజా యుద్ధనౌక, విప్లవ కవి గద్దర్  నటించిన ఆఖరి చిత్రం,"ఉక్కు సత్యాగ్రహం". ఈ సినిమా కి సంబందించిన విడుదల తేదీని నేడు ప్రకటించారు. ఈ సినిమాని ఈ నెల 29న బ్రహ్మాండంగా విడుదల చేస్తున్నారు. గద్దరన్న మూడు పాటలు పాడి రెండు పాటల్లో, కొన్ని సందేశాత్మక సీన్స్ లో నటించారు. గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ అద్భుతమైన సాహిత్యం అందించారు.
 
ఈ సందర్భంగా దర్శకులు సత్యారెడ్డి మాట్లాడుతూ, "విప్లవ కవి గద్దర్ అన్న నటించిన ఆఖరి చిత్రం ఉక్కు సత్యాగ్రహం ఈ నెల 29 న విడుదల కానుంది. తన పదవి కి తృణప్రాయం గా రాజీనామా చేసిన లక్ష్మి నారాయణ గారి తో పాటు ఎంతో మంది ఉద్యమకారులని దృష్టి లో ఉంచుకొని ఈ సినిమా కథానాయకుడి పాత్ర గద్దర్ గారు తీర్చిదిద్దారు. ఈ సినిమా నిజ జీవితానికి దగ్గరగా ఉన్న ఉద్యమ చిత్రం" అని అన్నారు.
 
లక్ష్మి నారాయణ మాట్లాడుతూ, "ఉక్కు సత్యాగ్రహం చిత్రం ద్వారా, విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఏ విధంగా ప్రయివేటీకరణ చేస్తున్నారు, అక్కడి ప్రజలు ఎలా అడ్డుకుంటున్నారు అనేది చూపించారు. కొన్ని సన్నివేశాలు చూసాను, ఈ సినిమా ఇన్స్పిరింగ్ గా ఉంది. ఈ సినిమా చూస్తుంటే, ఈ ప్రక్రియ లో మనం కూడ భాగస్వామ్యం అవ్వాలని అనిపిస్తుంది. గద్దర్ కూడా ఈ సినిమా లో నటించడం మంచి విషయం. అయన నన్ను లచ్చన్న ఎట్లున్నావ్ అని పలకరించేవారు. అయన స్వయంగా నటించిన సినిమా ఇది. అయన స్ఫూర్తి ని ఈ సినిమా లో నింపారు. ఈ సినిమా బ్రహ్మాండమైన విజయం చవిచూస్తుందని, అందరూ సినిమా ని ఆదరిస్తారని, విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రయివేటీకరణ కాకుండా ఉంటుందని కోరుకుంటూ, ఈ సినిమా లో నటించిన అందరికీ విజయం దక్కాలని ఆశిస్తున్నాను. ఈ సినిమా దర్శకులు సత్యా రెడ్డి గారికి కూడా నా అభినందనలు." అని తెలిపారు.
 
గద్దర్ కూతురు వెన్నెల మాట్లాడుతూ, "ఈ రోజు ఉక్కు సత్యాగ్రహం సినిమా విడుదల తేదీ ని అనౌన్స్ చేసేందుకు మీ ముందుకు వచ్చాను. గద్దర్ అన్న హైదరాబాద్ నుంచి విశాఖ కు బయల్దేరి మళ్ళీ ఇంటికొచ్చే వాళ్ళు. ఈ సినిమా కోసం ఆయన చాలా సమయం కెటించారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ చేయకూడదు అనేది ఆయన ఉద్దేశ్యం. ఎవరైతే తమ రక్తం చిందించి స్టీల్ ప్లాంట్ ని డెవలప్ చేసారో, వాళ్ళని కోసం ఈ సినిమా చేసారు గద్దర్. ఆయన ఈ సినిమా లో నటించినట్టు లేదు, జీవించినట్టు ఉంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను," అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాకు మరిన్ని మంచి లవ్ స్టోరీస్ రాబోతున్నాయి : మిస్ యు హీరో సిద్ధార్థ్