తెలుగు బుల్లితెర నటి శ్రీవాణి మాట్లాడగలుగుతోంది. గత నెలలో ఆమె అరుదైన వ్యాధి బారిన పడింది. దీని కారణంగా ఆమె గొంతు తాత్కాలికంగా మూగబోయింది. తాజాగా ఆమె తీసుకున్న చికిత్స సక్సెస్ అయ్యింది. దీంతో ఆమె మళ్లీ ఎప్పటిలా మాట్లాడగలుగుతోంది.
ఈ విషయాన్ని హర్షం వ్యక్తం చేసింది. ఇంకా యూట్యూబ్‌లో వీడియో వదిలింది. డాక్టర్ సూచన మేరకు జూలై 19 నుంచి ఆగస్టు 19 వరకు అస్సలు మాట్లాడలేదు. కేవలం ఎక్స్‌ప్రెషన్స్‌తోనే మాట్లాడేశా. ఈ సమయంలో నాకోసం ఎంతోమంది ప్రార్థించారు. వారందరికీ చాలా థ్యాంక్స్ అని చెప్పుకొచ్చింది.
ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వెల్ కమ్ బ్యాక్ మేడమ్, మీ వాయిస్ విన్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది.