Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చెక్ బౌన్స్ కేసులో బుల్లితెర నటుడు ప్రదీప్ అరెస్టు

చెక్ బౌన్స్ కేసులో బుల్లితెర నటుడు ప్రదీప్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత రిమాండ్‌కు పంపడం, బెయిల్‌పై విడుదల చేయడం అంతా ఒక్క రోజులోనే జరిగిపోయాయి. అదీ సినీ ఫక్కీ తరహాలో జరిగింది.

చెక్ బౌన్స్ కేసులో బుల్లితెర నటుడు ప్రదీప్ అరెస్టు
, శనివారం, 10 జూన్ 2017 (09:22 IST)
చెక్ బౌన్స్ కేసులో బుల్లితెర నటుడు ప్రదీప్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత రిమాండ్‌కు పంపడం, బెయిల్‌పై విడుదల చేయడం అంతా ఒక్క రోజులోనే జరిగిపోయాయి. అదీ సినీ ఫక్కీ తరహాలో జరిగింది. 
 
ఓ వ్యక్తి వద్ద తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించే నిమిత్తం ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో ప్రదీప్‌ను హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు ఎర్రమంజిల్ న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఆ తర్వాత అతనికి న్యాయస్థానం రిమాండ్ విధించింది. 
 
దీంతో కోర్టు ఆదేశాల మేరకు అతనిని చంచల్ గూడ జైలుకి తరలించారు. అనంతరం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో గంటల వ్యవధిలో విడుదలయ్యాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

‘100% లవ్‌’ తమిళ రీమేక్‌‌లో కుమారి కాదల్.. లావణ్య, తమన్నాల ఛాన్స్ కొట్టేసింది