Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నీకు అవార్డ్ రాలేదన్నావు కదా నా అవార్డ్ తీసుకో చిరూ: మోహన్ బాబు

Advertiesment
నీకు అవార్డ్ రాలేదన్నావు కదా నా అవార్డ్ తీసుకో చిరూ: మోహన్ బాబు
, సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (13:15 IST)
ఆదివారం నాడు టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యుసర్ టి. సుబ్బరామిరెడ్డి జన్మదినోత్సం సందర్భంగా ఈ సంవత్సరం నిర్వహించిన టీఎస్‌ఆర్ నేషనల్ అవార్డ్స్ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, బాలక్రిష్ణ, నాగార్జున, మోహన్ బాబు, విశాల్, రకుల్ ప్రీత్ సింగ్‌లతో పాటు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులందరు వచ్చారు.
 
ఈ వేడుకలో రామ్‌చరణ్‌కి రెండు అవార్డ్స్ వచ్చాయి. 2017 సంవత్సరంలో మోస్ట్ పాపులర్ ఫిల్మ్ ప్రొడ్యుసర్ (ఖైదీ నెం.150), 2018 సంవత్సరంలో బెస్ట్ హీరో (రంగస్థలం) చిత్రాలకు రామ్‌చరణ్‌కు అవార్డ్స్ వచ్చాయి. చిరంజీవి గారు బాలక్రిష్ణ, మోహన్ బాబు, నాగార్జున, టీఎస్‌ఆర్ చేతుల మీదుగా ఈ అవార్డుల్ని అందుకుంటూ సుబ్బరామిరెడ్డి, తన తోటి నటీనటులపైన ప్రశంసల జల్లు కురిపించారు. 
 
చిరంజీవి మాట్లాడుతూ.. టీఎస్ఆర్ అవార్డ్స్ ఇన్ని సంవత్సరాలుగా సుబ్బరామిరెడ్డి గారు నిర్వహించడానికి ఆయనకి శక్తి ఎక్కడ నుండి వస్తుందో తెలియడం లేదు. కానీ, ఈరోజు నేను బాలక్రిష్ణ, నాగార్జున, మోహన్ బాబు అందరం మొక్కుబడిగా కాకుండా ఇష్టంతోనే ఇక్కడికి వచ్చాం అంటూ.. మా అందరిని ఒకే వేదికపైకి తీసుకురావడం ఒక్క సుబ్బరామిరెడ్డి గారికి మాత్రమే సాధ్యమవుతుందని ఎంతో గర్వంగా చెప్పుకొచ్చారు.
 
ఈ వేడుకలో నాగార్జునకు, బాలక్రిష్ణకు, మోహన్ బాబుకు అవార్డ్స్ వచ్చాయి.. నాకే ఏ అవార్డ్ రాలేదు అంటూ.. రంగస్థలం సినిమా చూసిన తరువాత చరణ్ పెర్ఫామెన్స్ చూసి తండ్రిగా చాలా గర్వపడుతున్నానని.. తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు మెగాస్టార్.
 
చిరంజీవి స్పీచ్ ముగించిన తరువాత మోహన్ బాబు మాట్లాడుతూ.. నీకు అవార్డ్ రాలేదన్నావు కదా.. నా అవార్డుని నీకు, చరణ్‌కి ఇస్తునా తీసుకో అన్నారు. అప్పుడు చిరంజీవి అలా కాదు కానీ.. మనం ఇద్దరం ఈ అవార్డును పంచుకుందాం.. అంటూ తన మెడలోని శాలువాని తీసి మోహన్ బాబుతో కలిపి కప్పుకున్నారు. ఇది చూసిన ప్రేక్షకులు హర్షధ్వానాలు చేశారు.   

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమిస్తారు.. బ్రేకప్ అంటారు.. ఇంకొకర్ని ప్రేమిస్తారు.. అదెలా సాధ్యం.. ఐశ్వర్యా రాజేశ్