యుద్దనపూడి సులోచనరాణి రాసిన మీనా నవలను కాపీ కొట్టి త్రివిక్రమ్ అ.. ఆ.. సినిమాను తెరకెక్కించారని వార్తలొచ్చాయి. జూన్ 2న రిలీజైన ఈ సినిమా నవలకు కాపీయా అంటూ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే రెండు రోజులుగా జోరుగా ఈ విషయమై వాదోపవాదలు ఫేస్ బుక్, ట్విట్టర్‌లో జరుగుతున్నా, ఫిల్మ్ సర్కిల్స్ లో అందరికి తెలిసినా 'అ ఆ' టీమ్ మాత్రం ఎక్కడా నోరెత్తలేదు.
కానీ.. అ.. ఆ.. సినిమా సక్సెస్ మీట్ హైదరాబాదులోని ఓ స్టార్ హోటల్‌లో నిర్వహించారు. ఈ వేడుకలో ఈ విషయంపై త్రివిక్రమ్ క్లారిటి ఇచ్చారు. 'అ ఆ' చిత్రం ప్రారంభమయ్యేందుకు ముందే సులోచనరాణి గారితో మాట్లాడనని ఈ చిత్రం క్యారెక్టర్స్ గురించి ఆమె సూచనలు ఇచ్చారని చెప్పారు.
సులోచనరాణి పేరును కేవలం థ్యాంక్స్ కార్డు మాత్రమే వేశామని కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన క్రెడిట్ వేయలేకపోయమని ఇప్పుడున్న డిజిటల్ టెక్నాలజీ వల్ల దాన్ని యాడ్ చేయడానికి 48 గంటలకు పట్టిందని ఇక మీదట మీరు చూడవచ్చని త్రివిక్రమ్ చెప్పారు. ఈ వివాదం ఇంతటితో ముగిసిపోయిందని అనుకుంటున్నాను. ఇకపైనా దీన్ని వివాదం చేయాలనుకుంటే మాత్రం దీనిపై మాట్లాడనని త్రివిక్రమ్ వెల్లడించారు.