Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నయనతారతో అక్కడే గొడవ.. పుకార్లతోనే దూరం పెరిగింది: త్రిష

నయనతార-త్రిషల గొడవపై నయనతార మాత్రం కామ్‌గా ఉండిపోయింది. కానీ త్రిష మాత్రం ఇప్పటికే రెండుసార్లు స్పందించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో త్రిష మాట్లాడుతూ, వృత్తిపరంగా తప్ప వ్యక్తిగతంగా మా ఇద్దరి మధ్యా ఎలాంటి

Advertiesment
Trisha Shocking Comments On Nayanatara
, శనివారం, 12 నవంబరు 2016 (12:15 IST)
నయనతార-త్రిషల గొడవపై నయనతార మాత్రం కామ్‌గా ఉండిపోయింది. కానీ త్రిష మాత్రం ఇప్పటికే రెండుసార్లు స్పందించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో త్రిష మాట్లాడుతూ, వృత్తిపరంగా తప్ప వ్యక్తిగతంగా మా ఇద్దరి మధ్యా ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని స్పష్టం చేసింది.
 
తామిద్దరం మంచి స్నేహితులమేనని చెప్పుకొచ్చింది. సినిమాల దగ్గరకి వచ్చేసరికి కొంత సమస్య వచ్చిందే కానీ.. ఆ సమస్యను కూడా స్నేహితుల ద్వారా పరిష్కరించుకున్నామని చెప్పింది. ప్రస్తుతం తామిద్దరం ఎక్కడ కలిసినా మంచి ఫ్రెండ్స్‌గా మాట్లాడుకుంటున్నామని చెప్పుకొచ్చింది. అయితే కొందరు లేని పోని పుకార్లు పుట్టించడం ద్వారానే మా మధ్య దూరం పెరిగిందని త్రిష వెల్లడించింది.
 
సినిమాల గురించి త్రిష మాట్లాడుతూ.. గ్లామరస్ రోల్స్ ఇక చాలు.. సీరియస్ క్యారెక్టర్లపై దృష్టి పెట్టానని చెప్పుకొచ్చింది. నెగటిల్ రోల్స్ చేస్తానని.. నెగటివ్ రోల్స్‌కు సరిపోతానా లేదా అనేది దొరికిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ పోతే తెలిసిపోతుందని తెలిపింది. 
 
తమిళనాడు సీఎం జయలలిత పాత్రలో కనిపించాలని ఆశగా ఉంది. కానీ చేయగలనో లేదో అనేది చిన్న అనుమానం. కానీ ఈ సినిమాతో ప్రేక్షకులు తనను ఆదరిస్తానని నమ్మకం ఉంది. అలాంటి రోల్స్ వస్తే తప్పకుండా చేస్తానని వెల్లడించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్కినేని నాగార్జునను తాకిన నోట్ల కష్టాలు.. ఎస్ఎస్ఎస్ కలెక్షన్స్ డౌన్.. చైతూ, అఖిల్ పెళ్ళి ఎలా?