సీనియర్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ తనపై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు తెలపడంపై హీరోయిన్ త్రిష స్పందించారు. తప్పు చేయడం మానవ సహజనమని.. దాన్ని మన్నించడం దైవ గుణమని అన్నారు. దీంతో ఈ వివాదానికి త్రిష కూడా ఫుల్ స్టాప్ పెట్టేశారు.
కాగా త్రిషపై మన్సూర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైనాయి. లియో సినిమాలో త్రిష నటిస్తుందనగా.. అందులో ఆమెతో తనకు రేప్ సీన్ వుంటుందని తాను భావించానని.. కానీ ఆ సీన్ లేకపోవడంతో తాను చాలా నిరాశకు గురయ్యానని మన్సూర్ తెలిపాడు.
ఈ వ్యాఖ్యలపై సెలెబ్రిటీలు ఫైర్ అయ్యారు. ఈ అసభ్యకర వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకా కేసు కూడా నమోదైంది. దీంతో మన్సూర్ త్రిష వ్యాఖ్యలపై క్షమాపణలు తెలిపారు.