Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అవసరానికో అబద్దం ఆడే హీరోగా త్రిగున్

rigun, Rubal Sheikh Rawat
, శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (19:25 IST)
rigun, Rubal Sheikh Rawat
మనిషి జీవితంలో నిజానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అబద్దానికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉందని చెప్పే సందేశాత్మక చిత్రమే "అవసరానికో అబద్దం". శ్రీమతి ఝాన్సీ, శ్రీ కృష్ణమూర్తి యలమంచిలి సమర్పణలో గ్లోబల్ ఎంపవర్ బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై డాక్టర్ శివకుమార్ చికిన గారి సహకారంతో త్రిగున్, రుబాల్ షేక్ రావత్ జంటగా ఆయాన్ బొమ్మాళిని దర్శకుడిగా పరిచయం చేస్తూ డాక్టర్ జై యలమంచిలి నిర్మిస్తున్న నూతన చిత్రం పూజా కార్యక్రమాలు శుక్రవారం హైదరాబాద్ లోని రామా నాయుడు స్టూడియోలో వైభవంగా ప్రారంభమైంది. 
 
పూజా కార్యక్రమాల అనంతరం హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత దిల్ రాజు క్లాప్ కొట్టగా, తెలుగు నిర్మాతల మండలి ప్రెసిడెంట్ దామోదర ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. నిర్మాత సురేష్ బాబు గారు గౌరవ దర్శకత్వం వహించారు.
 
అనంతరం చిత్ర దర్శకుడు ఆయాన్ బొమ్మాళి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి జీవితంలో అబద్ధం అనేదానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎంతగా అంటే చిన్నప్పుడు గోరుముద్దలు తినకపోతే బూచోడు ఎత్తుకు పోతాడు అని అమ్మ చెప్పే అబద్దం నుండి,మనం చనిపోయేముందు మనం బెడ్ మీద ఉన్నప్పుడు కూడా డాక్టర్ వచ్చి నీకేం కాదని చెప్పే దైర్యం వరకు, మనిషి జీవితంలో అబద్దానికి చాలా ఇంపార్టెంట్స్ ఉందని చెప్పే సందేశాత్మక చిత్రమే "అవసరానికో అబద్దం".అలాగే మహాభారతంలో శ్రీ కృష్ణుడు కొన్ని సందర్భాల్లో అబద్దం ఆడవచ్చు అని చెప్పాడు. దానిని ఆదర్శంగా తీసుకొని కమర్శియల్ వేలో సినిమాటిక్ గా సినిమా తీస్తే ఎలా ఉంటుందనే ఐడియాతో చేసిన కథ ఇది.ధర్మం కాపాడాలి అంటే ధర్మ రాజు తోనే అబద్ధం ఆడించాలనే స్ట్రాంగ్ క్యారెక్టర్ హీరోది. మణిశర్మ గారు మా సినిమాకు మ్యూజిక్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మంచి కథతో చేస్తున్న ఈ సినిమా అన్ని వర్గాల వారికీ కచ్చితంగా నచ్చుతుంది. అన్నారు. 
 
చిత్ర నిర్మాతలు కృష్ణమూర్తి యలమంచిలి, డాక్టర్ జై యలమంచిలి మాట్లాడుతూ.. ఇదే సినిమా ఇండస్ట్రీలో నేను పెరిగిన వాణ్ని. ఏ టెంపుల్ కు వెళ్లినా, చర్చి కి వెళ్లినా మసీద్ కు వెళ్లినా అందరూ ధర్మో రక్షిత రక్షితః అంటాము. ధర్మాన్ని గెలిపించాలి అనే ఒక ఉద్దేశంతో మేము చేస్తున్న ఈ ఒక మంచి ప్రయత్నం "అవసరానికో అబద్ధం". ఈ సినిమాకి నాంది పలికింది దర్శకుడు బొమ్మాళి. తను చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాను. సినిమా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ప్రేక్షకులకు కావలసిన అంశాలు అన్ని ఇందులో ఉంటాయి. సినిమాకు తగ్గట్టు మంచి ఎనర్జీటిక్ ఉన్న హీరో, హీరోయిన్ లతో పాటు ఎగ్జిగ్గ్యూటర్ వెంకటేష్ ఆధ్వర్యంలో మాకు మంచి టెక్నిషియన్స్ లభించారు. మంచి కథతో వస్తున్న ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.
 
చిత్ర హీరో త్రిగున్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు చాలా క్రాస్ జోనర్ సినిమాలు చెయ్యడం జరిగింది. అలాగే దర్శకుడు ఆయాన్ బొమ్మాళి చెప్పిన కథ చాలా డిఫరెంట్ గా అనిపించిడంతో ఈ సినిమా చేస్తున్నాను.మా గురువు గారు మణి శర్మగారు నాకు 2022 లో పదములే లేవు పిల్ల వంటి బ్లాక్ బస్టర్ సాంగ్ ఇచ్చాడు. మళ్ళీ తను ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ సాంగ్ ఇస్తాడని కోరుకుంటున్నాను. మా నిర్మాత డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి గారికి సినిమా అంటే ప్యాషన్. మంచి కథను సెలెక్ట్ చేసుకోని తీస్తున్న ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చినందుకు వారికి, దర్శకులు బొమ్మాళి కి నా ధన్యవాదములు అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వారికి నా పాట‌ల‌పై మంచి సెంటిమెంట్ ఉంది : వరంగల్ శ్రీనివాస్