Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అవకాశాలు లేక బిగ్ బాస్ సీజన్‌కి సమ్మతించిన రాహుల్ దేవ్

''సింహాద్రి'', ''షాడో'', ''నాయక్'' వంటి సినిమాల్లో నటించిన రాహుల్ దేవ్ ఉత్తరాది వాడైనా తెలుగువారికి సుపరిచితుడే. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సినిమాల్లో విలన్‌గా నటించి మెప్పించిన రాహుల్ దేవ్ సినిమాల్

Advertiesment
Bigg Boss
, మంగళవారం, 25 అక్టోబరు 2016 (10:47 IST)
''సింహాద్రి'', ''షాడో'', ''నాయక్'' వంటి సినిమాల్లో నటించిన రాహుల్ దేవ్ ఉత్తరాది వాడైనా తెలుగువారికి సుపరిచితుడే. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సినిమాల్లో విలన్‌గా నటించి మెప్పించిన రాహుల్ దేవ్ సినిమాల్లో అవకాశాలులేని కారణంగా 'బిగ్ బాస్ సీజన్ 10'లో పాల్గొంటున్నానని తెలిపాడు. సూపర్ మోడల్ పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న రాహుల్ దేవ్ సినీపరిశ్రమలోకి అడుగుపెట్టి విలన్ పాత్రలు పోషించి అన్నిభాషల్లోను నటించి ఆకట్టుకున్నాడు. 
 
'బిగ్ బాస్ 10'లో పాల్గొనడంపై ఆయన మాట్లాడుతూ తన కుమారుడు సిద్ధార్థ్‌ ప్రస్తుతం విదేశాల్లో చదువుకుంటున్నాడని తెలిపాడు. అతని విద్యకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడం కోసమే తాను 'బిగ్‌ బాస్‌ షో'లో పాల్గొంటున్నానని చెప్పాడు. దానికి తోడు ప్రస్తుతానికి తన చేతిలో సినిమా అవకాశాలు కూడా లేవు. 
 
ఇలాంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంగా ''బిగ్‌ బాస్'' అవకాశాన్ని అంగీకరించానన్నాడు. గతంలో బిగ్‌ బాస్‌‌ కార్యక్రమంలో అవకాశం వచ్చినప్పుడు తనకు ఇంట్రెస్ట్‌ లేకపోవడంతో అంగీకరించలేదని, ఇప్పుడు మాత్రం పరిస్థితుల ప్రభావం వల్ల 'బిగ్ బాస్'లో పాల్గొంటున్నానని చెప్పాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాజల్‌కు పోర్న్ వీడియోలు పంపుతున్న స్టార్ హీరో... భార్యకు కూడా తెలుసట...