Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టాలీవుడ్ నిర్మాత కె. మురారి కన్నుమూత

Advertiesment
Murari
, శనివారం, 15 అక్టోబరు 2022 (23:10 IST)
ప్రముఖ సినీ నిర్మాత కాట్రగడ్డ మురారి శనివారం నాడు కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో ఆయన పరమపదించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన వయసు 78 ఏళ్లు.

 
విజయవాడ వాస్తవ్యులైన కె. మురారి మొదట్లో సినీ దర్శకత్వం చేయాలని మద్రాసు వెళ్లారు. తన వైద్య వృత్తిని వదులుకుని మరీ సినిమాలపై వున్న ఆసక్తితో వెళ్లారు కానీ దర్శకుడు కాకుండా నిర్మాతగా మారారు. యువచిత్ర ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. గోరింటాకు, సీతామహాలక్ష్మి, జానకిరాముడు, నారినారి నడుమ మురారి, త్రిశూలం తదితర చిత్రాలు నిర్మించారు. ఆయన పదేళ్ల క్రితం నవ్విపోదురుగాక అనే పేరుతో ఆత్మకథ రాసారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాత సినిమాలు థియేట‌ర్‌లోకి, కొత్త సినిమాలు ఓటీటీలోకి, స్పెష‌ల్ స్టోరీ