Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'బ్రహ్మోత్సవం' తర్వాత ఫ్యామిలీ చిత్రాలు చేయడం మానేస్తారు.. రాంగోపాల్ ట్వీట్స్

'బ్రహ్మోత్సవం' తర్వాత ఫ్యామిలీ చిత్రాలు చేయడం మానేస్తారు.. రాంగోపాల్ ట్వీట్స్
, ఆదివారం, 22 మే 2016 (13:16 IST)
నిన్నమొన్నటివరకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని ట్వీట్స్ చేసిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇపుడు ప్రిన్స్ మహేష్ బాబును లక్ష్యంగా చేసుకున్నాడు. మహేష్ తాజాగా నటించిన 'బ్రహ్మోత్సవం' నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీనిపై ఆర్జీవీ తనదైనశైలిలో సెటైర్లు వేస్తూ ట్వీట్స్ చేశారు. 
 
'నాకు ప్రధానమైన ఉత్సవం ఏంటంటే... బ్రహ్మోత్సవం తర్వాత ఇక ఫ్యామిలీ చిత్రాలు చేయడం మానేస్తారు, నాకు ఇప్పుడే బ్రహ్మదేవుడు ముఖం చూడాలని ఉందంటూ ట్వీట్‌ చేశాడు. ఓ పాటలో మహేశ్‌బాబు డ్యాన్స్‌ను ప్రస్తావిస్తూ... ప్రపంచ వ్యాప్తంగా పేరుపొందిన కొరియోగ్రాఫర్స్‌ అయిన సేవియన్‌ గ్లోవర్‌, మార్తా గ్రాహమ్‌, జార్జ్‌ బెలాన్‌షైన్‌ తదితరులు ఇది చూసి నేర్చుకోవాలి' అని ఆ డ్యాన్స్‌ వీడియోను పోస్ట్‌ చేశారు.
 
అలాగే, 'కుటుంబ కథా చిత్రాల్లో... తండ్రి హీరోయిన్‌ ఆస్తులు చూస్తాడు, తల్లి బట్టలు చూస్తుంది, కుమార్తె బాయ్‌ఫ్రెండ్‌కి మెసేజ్‌లు పంపుతుంటుంది, బోర్‌ కొట్టిన కొడుకు నిద్రపోతాడు... మిస్టర్‌ M (మహేష్) మీరు అర్థం చేసుకోవాల్సింది ఎంటంటే... కుటుంబ కథా చిత్రాలు థియేటర్స్‌లో ఎంట్రీకి, ఎగ్జిట్‌కు మాత్రమే, ఒకసారి సీట్లో కూర్చున్నాక ప్రేక్షకులు 'పోకిరి', 'ఒక్కడు', 'బిజినెస్‌మెన్‌' వంటి చిత్రాలను చూడాలనుకుంటారు అని పేర్కొన్నారు.
webdunia
 
 
అదేవిధంగా మంచి కుటుంబ కథా చిత్రాలు శోభన్‌బాబు మాత్రమే చేయగలరు. కృష్ణ, ఎన్టీఆర్‌ కాదు. 'దేవత' అద్భుతమైన చిత్రం. అందులో నాకు కథ గుర్తుంది గానీ... శోభన్‌బాబు గుర్తులేరు. కృష్ణ 'ఏజెంట్‌ గోపీ', ఎన్టీఆర్‌ 'అడవిరాముడు' చిత్రాల్లో హీరోలు గుర్తున్నారు. కానీ ఆ కథలు గుర్తులేవు. సాధారణ కుటుంబాలల్లో మీ సూపర్‌ స్టార్‌డమ్‌ ఇంకా అద్భుతమంగా ఉండాలి మిస్టర్‌ M' అంటూ వర్మ ట్వీట్‌ చేశారు. తన ట్వీట్లకు మహేష్ బాబు ఫ్యాన్స్ పాజిటివ్‌గా స్పందించాలని ఆర్జీవీ కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోలీసులను వణికించిన వ్యక్తి వీరప్పన్.. ఆసియాలోనే ఎవరూ లేరు : రాంగోపాల్ వర్మ