Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పద్మతోనే శాశ్వత నిద్రలో దాసరి నారాయణ రావు... ఆమె జ్ఞాపకాలతోనే.. తిరిగిరాని లోకాలకు..

దాసరి సతీమణి మరణించడంతోనే దర్శకరత్న దాసరి నారాయణ రావు కుంగిపోయారు. పద్మ మరణించిన 2011, అక్టోబర్ 28న దాసరి సతీమణి కన్నుమూసిన తర్వాత మానసికంగా కుదేలైపోయారు. పద్మ మరణించిన నాడు దాసరి చిన్న పిల్లాడి ఏడుస్

పద్మతోనే శాశ్వత నిద్రలో దాసరి నారాయణ రావు... ఆమె జ్ఞాపకాలతోనే.. తిరిగిరాని లోకాలకు..
, బుధవారం, 31 మే 2017 (09:47 IST)
దాసరి సతీమణి మరణించడంతోనే దర్శకరత్న దాసరి నారాయణ రావు కుంగిపోయారు. పద్మ మరణించిన 2011, అక్టోబర్ 28న దాసరి సతీమణి కన్నుమూసిన తర్వాత మానసికంగా కుదేలైపోయారు. పద్మ మరణించిన నాడు దాసరి చిన్న పిల్లాడి ఏడుస్తుంటే ఆయన్ను ఓదార్చడం ఎవరి తరమూ కాకపోయింది. అప్పటివరకు తనను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన జీవిత భాగస్వామి తనను శాశ్వతంగా వదిలిపోవడంతో దాసరి కోలుకోలేకపోయారు. 
 
సమయానికి మందులు తీసుకోకుండా.. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోలేదు. ఫలితంగా రోగాలను కొనితెచ్చుకున్నారు. పుట్టిన రోజు వేడుకల రోజున కూడా దాసరి పద్మను తలచుకున్నారని సన్నిహితులు చెప్తున్నారు. ఆనాడు పద్మ అంత్యక్రియలు మొయినాబాద్‌ మండలం తోల్‌ కట్ట సమీపంలోని సొంత ఫాంహౌస్‌లో జరుగగా, అప్పటి నుంచి ఎన్నో మార్లు దాసరి అక్కడికి వెళ్లి ఆమె జ్ఞాపకాల్లో గంటల సమయాన్ని గడుపుతూ ఉండేవారు. ఇప్పుడాయన తన ప్రియాతి ప్రియమైన పద్మ దగ్గరికే వెళ్లిపోయారు. బుధవారం దాసరి కూడా అదే ప్రాంతంలో శాశ్వతంగా నిద్రపోనున్నారు. 
 
కాగా ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించిన దాసరికి పద్మ వెన్నంటి వున్నారు. ఆర్థిక భారాలు తన భర్తపై పడకుండా పద్మ నిర్మాతగా వ్యవహరించి, ఆర్థిక కార్యకలాపాలను పర్యవేక్షిస్తుండేవారు. దాసరి దర్శకత్వం వహించిన శివరంజని, ఒసేయ్‌ రాములమ్మ, మజ్ను, ఒరేయ్‌ రిక్షా, మేఘసందేశం వంటి పలు చిత్రాలకు ఆమె నిర్మాతగా ఉన్నారు. సొంతడబ్బు ఖర్చు పెట్టి మరీ సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. అందుకే చెన్నై ఆటో కార్మికుల సంఘానికి ఆమె అధ్యక్షురాలిగా మారారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇకపై మా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి?: భౌతికకాయం వద్ద బోరున విలపించిన సుద్దాల అశోక్ తేజ