Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'సింగం-3'కు రాజకీయాల ఎఫెక్ట్ - థియేటర్లు ఖాళీ...

తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితి, హైడ్రామాకు తాత్కాలికంగా తెరపడినా ఆ ప్రభావం మాత్రం మాత్రం సినిమాలపై ఎక్కువగా చూపిస్తోంది. తమిళ రాజకీయాల్లో జరుగుతున్న పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆశక్తిగా గమనిస్తున్

'సింగం-3'కు రాజకీయాల ఎఫెక్ట్ - థియేటర్లు ఖాళీ...
, సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (10:54 IST)
తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితి, హైడ్రామాకు తాత్కాలికంగా తెరపడినా ఆ ప్రభావం మాత్రం మాత్రం సినిమాలపై ఎక్కువగా చూపిస్తోంది. తమిళ రాజకీయాల్లో జరుగుతున్న పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆశక్తిగా గమనిస్తున్న తమిళ ప్రజలు థియేటర్లకు వెళ్ళడమే మానేశారట. దీంతో కొత్తగా రిలీజైన సినిమాల పరిస్థితి చెప్పనక్కర్లేదు. థియేటర్ల యజమానులు ఈగలు తోలుకుంటున్నారట. తమిళ సినిపరిశ్రమలో అగ్రహీరోలలో ఒకరైన సూర్య నటించిన 'సింగం-2' పరిస్థితి కూడా ఇప్పుడు అదే. భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమాను చూసేందుకు జనం అసలు థియేటర్లకు రావడమే లేదట. కారణం సినిమా బాగాలేక కాదు.. సమయం సరిపోక.
 
తమిళ రాజకీయాలు..ఇప్పుడు ఎక్కడ చూసినా దీనిపైనే టాపిక్. ఒక్క తమిళనాడు మాత్రమే కాదు.. దేశం మొత్తం ఇదే టాపిక్..పక్కనున్న ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్లో అయితే ఈ పీవర్ మరింత ఎక్కువగా ఉంది. కారణం రసవత్తరంగా జరుగుతున్న రాజకీయాలే. ఒకవైపు పళణిస్వామి, మరోవైపు పన్నీరుసెల్వం, ఇంకోవైపు స్టాలిన్ ఇలా... మార్చి.. మార్చి నిమిషానికి ఒకసారి జరుగుతున్న రాజకీయ ఉత్కంఠ. అందుకే తమిళ ప్రజలు టీవీల్లోకి, సామాజిక మాధ్యమాల్లోకి అతుక్కుపోయారట. అందుకే సినిమాలపైన అసలు ఇంట్రస్ట్ చూపించడం లేదట. 
 
సరిగ్గా ఇదే సమయంలో సింగం-2 సినిమా రిలీజైంది. ఇంకేముంది. తమిళనాడులోని చాలా థియేటర్లలో ఆర్భాటంగా సినిమాను రిలీజ్ చేశారు కానీ చూసే వాళ్ళు లేరట. కనీసం ఆయన అభిమానులు కూడా మొదటిరోజు పెద్దగా సినిమా థియేటర్లకు రాలేదంటే తమిళరాజకీయాల పరిస్థితి ఏ విధంగా ఉన్నాయో చెప్పనక్కర్లేదట.
 
సింగం-2 సినిమా మాత్రం చాలా బాగుందని తమిళ సినీవర్గాల కితాబు. సూర్యతో పాటు శృతిహాసన్, అనుష్కలు నటించిన ఈ సినిమా అంతా యాక్షన్‌ కథా చిత్రం. చిత్రం బాగానే ఉన్నా థియేటర్లు మాత్రం ఖాళీగా ఉన్నాయి. దీంతో సినిమాలు కొనుక్కున్న వారు ఇప్పుడు లబోదిబో మంటున్నారట. తమిళ నాడులో జరుగుతున్న పంచాయతీ తరువాత సినిమాను రిలీజ్ చేసి ఉంటే బాగుండేదని అనుకుంటున్నారట సినిమా నిర్మాత. ఇప్పుడు ఏమనుకుని ఏం లాభం. అంతా అయిపోయిన తరువాత అంటున్నారట థియేటర్ల యజమానులు. ఇక చూడాలి. ఇప్పటికే తమిళరాజకీయాలు ఒక కొలిక్కి వస్తున్న పరిస్థితుల్లో సింగం-2 సినిమాను చూడడానికి ప్రేక్షకులు వెళతారేమో...!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాజీ ప్రియులంతా నా సుఖం కావాలని పరితపిస్తున్నారు : కంగనా రనౌత్