బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ తాజా లుక్ వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో షారూఖ్ లుక్ అదుర్స్ అనిపించేలా వుంది. బ్రౌన్ టీ-షర్ట్ మీద డెనిమ్ జాకెట్ ధరించి, బాలీవుడ్ సూపర్‌స్టార్ ఒక చిన్న వేదికపై నిలబడి మైక్రోఫోన్‌లో మాట్లాడుతాడు. ముదురు గోధుమ రంగు జుట్టుతో షారూఖ్ లుక్ బాగా వుంది.
ఈ లుక్‌కు సంబంధించిన ఇన్‌స్టా రీల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇక్కడో ఓ ట్విస్ట్.. అది ఒరిజినల్ షారూఖ్ ఖాన్ కాదు.. డూప్ షారూఖ్. షారూఖ్ ఖాన్‌ను పోలిన వ్యక్తికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఈ వీడియో ద్వారా షారుఖ్ ఖాన్ పోలిన వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో 2.2 మిలియన్ల మంది ఫాలోయింగ్ సంపాదించారు. ఈ రీల్స్ ద్వారా షారూఖ్ ఖాన్ లాగానే వున్న వ్యక్తి బైక్ నడపడం, డ్యాన్స్ చేయడం చూడవచ్చు.
ఈ నకిలీ SHRK కూడా నేటి చాలా మంది ప్రముఖుల కంటే ఎక్కువ దృష్టిని ఆకర్షిస్తున్నాడని సినీ పండితులు అంటున్నారు. ఈ వ్యక్తి గుజరాత్‌లోని జునాగఢ్ అనే చిన్న ప్రాంతానికి చెందిన వాడు.