Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

80 ఏళ్ళ ఇండియన్‌ సినీచరిత్రలో గోల్డెన్‌ డే ఇదే : రామ్‌చరణ్‌

Advertiesment
Ramcharan latest
, శనివారం, 25 ఫిబ్రవరి 2023 (09:44 IST)
Ramcharan latest
ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమా అకాడమీ అవార్డుకు నామినేట్‌ అవ్వడం ఆ తర్వాత జరిగిన పరిణామాలను పరిశీలిస్తే ఇండియన్‌ సినిమాకు చాలా రెస్పెక్ట్‌ వుందని అర్థమవుతుంది. ఇటీవలే హాలీవుడ్‌ క్రిటిక్‌ అవార్డును అందుకున్న రాజమౌళి, రామ్‌చరణ్‌లు కూడా అక్కడ మీడియాతో పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు.
 
ఆర్‌.ఆర్‌.ఆర్‌. ప్రాసెసింగ్‌ గురించి చరణ్‌ మాట్లాడుతూ, ఈ సినిమాతో చాలా ఎచీవ్‌ చేశాం. ఇండియాలో ఈస్ట్‌, సౌత్‌ అనే తేడాలేకుండా అందరూ కష్టపడిపనిచేశారు. ఫిలిం ఇండస్ట్రీలో భాగమైనందుకు గర్వంగా వుంది. హాలీవుడ్‌ సినిమాలను ఇండియాలో బాగా చూస్తారు. అభినందిస్తారు. అలాంటి హాలీవుడ్‌ ఇంటర్‌నేషనల్‌ ఫిలింన్స్‌ ను రెస్పెక్ట్‌ చేస్తున్నందుకు ఆనందంగా వుంది అన్నారు.
 
బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ నాటు నాటు సాంగ్‌ గురించి వివరిస్తూ, ఉక్రెయిన్‌లో యుద్ధానికి మూడు నెలల ముందు షూట్‌ చేశాం. ఉక్రెయిన్‌ పాలెస్‌లో ఎంతో మంది కళాకారులు పనిచేశారు. ఈ పాటకోసం 15 రోజులు పట్టింది. 7 ఏడు రోజులు రిహార్సల్స్‌ చేశాం. చాలా డిఫికల్ట్‌ సాంగ్‌. ఎనర్జీతోనే ఎప్పుడూ వుండాలి. నేనే కాకుండా అందరూ ఎనర్జీతో పనిచేశారని తెలిపారు. 
 
ఆస్కార్‌కు రావడం ఎలా ఫీలవుతున్నారు అనేదానికి రామ్‌ చరణ్‌ బదులిస్తూ.. నాకే కాదు.. 80 ఏళ్ళ ఫిలిం ఇండస్టీల్రో మొదటిసారి అకాడమికీ నామినేట్‌ అవడం గర్వంగా వుంది. ఇది నాదికాదు. ఇండియన్‌ ఫిలింస్‌ సక్సెస్‌ అన్నారు.
 
దేశం మొత్తం మీద మీరు కాంట్రిబ్యూట్‌ చేయడం ఎలా అనిపిస్తుంది అన్న ప్రశ్నకు... ఈ జర్నీలో భాగమైనందుకు మాటలతో చెప్పలేని ఆనందం. ఇది ఒక్కరోజులో జరిగిన వండర్‌ కాదు. దీని వెనుక చాలా కృషివుంది. ఆర్‌.ఆర్‌.ఆర్‌. కథను రాజమౌళిగారు తీయడం, కీరవాణి సంగీతం అందించడం, వారి నాన్నగారు విజయేంద్రప్రసాద్‌గారు కథ ఇవ్వడం. ఇవన్నీ చాలా గొప్ప విషయాలు.
 
ఈ అవార్డు రావడాన్ని ఇండియాలో ఎలా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఇండియాలో అన్ని కల్చర్లు వున్నాయి. హాలీవుడ్‌ను డామినేట్‌ చేసే స్థాయికివెళ్ళినందుకు ఆనందంగా వుంది. ఇక్కడ కల్చర్‌, సెంటిమెంట్‌తోపాటు మూలాల్లోకి వెళ్ళి కథను చెప్పడం విశేషం. 
 
తదుపరి ప్రాజెక్ట్‌ల గురించి రామ్‌చరన్‌ బదులిస్తూ, ఇండియాలో గొప్ప సినిమాలు చేస్తున్నాను. హాలీవుడ్‌ నుంచి కూడా గుడ్‌ రిసీవింగ్‌ వుందని.. ముగించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నటీమణుల జీవితం ఇంత కష్టంగా వుంటుందా? ఆత్రేయ