Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అవేంజర్స్‌ తరహాలో ఫాంటసీ థ్రిల్లర్ అగత్యా ట్రైలర్

Advertiesment
Agatya Trailer poster

దేవి

, మంగళవారం, 11 ఫిబ్రవరి 2025 (19:03 IST)
Agatya Trailer poster
హీరో జీవా, యాక్షన్ కింగ్ అర్జున్‌ సర్జా లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఫాంటసీ హారర్ థ్రిల్లర్ ‘అగత్యా’. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, వామిండియా బ్యానర్స్ పై ఇషారి కే గణేష్‌, అనీష్ అర్జున్ దేవ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ గీత రచయిత పా.విజయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంతో పాటు మంచి థ్రిల్లింగ్‌ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.
 
తాజాగా మేకర్స్ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. 'సుమారు 120 సంవత్సరాల క్రితం బ్రతికిన ఆత్మలని మీరు ఇప్పుడు కలుసుకోబోతున్నారు'అనే వాయిస్ తో మొదలైన ట్రైలర్ అద్భుతమైన విజువల్స్ తో సర్ ప్రైజ్ చేసింది.
 
సినిమా కాన్సెప్ట్, హారర్ ఫాంటసీ ఎలిమెంట్స్, బ్యాక్ డ్రాప్ నెవర్ బిఫోర్ ఎక్సపీరియన్స్ అందించాయి. జీవా, అర్జున్‌ సర్జా ఎక్స్ ట్రార్డినరీ ఫెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. రాశీఖన్నా ప్రజెన్స్ చాల ఇంట్ద్రటింగ్ గా వుంది.
 
దర్శకుడు పా.విజయ్‌ యూనిక్ కాన్సెప్ట్ తో థ్రిల్ చేయబోతున్నాడని ట్రైలర్ ప్రామిస్ చేస్తోంది. యువన్ శంకర్ రాజా బీజీఎం మరో హైలెట్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫాంటసీ హారర్ ఎలిమెంట్స్ ని మరింత ఎలివేట్ చేసింది. దీపక్ కుమార్ పాఢి కెమరా వర్క్ కట్టిపడేసింది. నిర్మాణ విలువలు టాప్ క్లాస్ లో వున్నాయి.
 
'అవేంజర్స్‌ తరహాలో ప్రేక్షకులను వేరే ప్రపంచానికి తీసుకెళ్లే ఫాంటసీ థ్రిల్లర్ ‘అగత్యా’. ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిఅస్తుంది. సినిమాను చూసే ప్రతి ఒక్కరికీ సరికొత్త అనుభూతిని అందిస్తుంది' అని మేకర్స్ తెలియజేశారు.
 
ఈ చిత్రంలో ఎడ్వర్డ్ సోన్నెన్‌బ్లిక్, యోగి బాబు, VTV గణేష్, రెడిన్ కింగ్స్లీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  
 
స్టార్ కంపోజర్ యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు, పాటలన్నీ చార్ట్ బస్టర్ అయ్యాయి. దీపక్ కుమార్ పాఢి డీవోపీగా పని చేసిన ఈ సినిమాకి షాన్ లోకేష్ ఎడిటర్.
 
ట్రైలర్ తో అంచనాలు పెంచిన  ‘అగత్యా’ ఫిబ్రవరి 28, 2025న తమిళం, తెలుగు, హిందీ భాషలలో పాన్ ఇండియా రిలీజ్ కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సూర్య సన్నాఫ్ కృష్ణన్ ప్రేమికుల రోజు సందర్భంగా మళ్లీ విడుదల