Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ది స్టోరి ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ ప్రపంచ వ్యాప్తంగా మే 12న గ్రాండ్ రిలీజ్

Advertiesment
Nihal Kodati, Drishika Chander
, మంగళవారం, 2 మే 2023 (16:13 IST)
Nihal Kodati, Drishika Chander
ఛార్మీ కౌర్ తో.మంత్ర, అనుపమ పరమేశ్వరన్ తో బటర్ ఫ్లై చిత్రాన్ని తెరకెక్కించిన జెన్ నెక్ట్స్ మూవీస్ బ్యానెర్ పై, మంత్ర సినిమా రచయిత రవి ప్రకాశ్ బోడపాటి డెబ్యూ దర్శకత్వంలో తెరకెక్కిన థ్రిల్లర్.. ది స్టోరి ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా రిలయన్స్ సంస్థ ద్వారా విడుదలకు సిద్దం అయింది. ఇప్పటికే విడుదలచేసిన ఈ మూవీ టీజర్ ఆద్యాంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. లవ్, యాక్షన్ తో పాటు, క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది.

ఓ మర్డర్ కేసును సాల్వ్ చేసే ప్రాసెస్ లో అన్ని కోణాల్లో జర్నలిస్టులు, పోలీసులు ఇన్వెస్ట్ గేషన్ చేసే నేపథ్యంలో ఈ కథ సాగుతున్నట్లు తెలుస్తుంది. 
 
ప్రసాద్ తిరువల్లూరి, పుష్యమి ధవళేశ్వరపులు సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న చిత్రంలో నిహాల్ కోదాటి హీరోగా, దృషికా చందర్ హీరోయిన్ లతో పాటు సినయర్ నటుడు మధునందన్, భార్గవ పోలుదాసు, భావన దుర్గం, సమర్థ యుగ్ అలాగే ప్రముఖ జర్నలిస్ట్ దేవి నాగావల్లీ, మెహెర్ శ్రీరామ్ తదితరులు నటిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్స్ కు ప్రాణం పోసేది మ్యూజికే.. మరీ అలాంటి అదిరిపోయే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ను గిడియన్ కట్టా అందించారు. సినిమాలో ప్రతీ ఫ్రేమ్ కూడా చాలా అద్బుతంగా ఉన్నాయి. అలాగే సినిమాలో వాడిన కలర్స్ కూడా చాలా బాగా పోట్రెట్ చేశారు డీఓపి అమర్ దీప్ గుత్తుల. ప్రతీ ఫ్రేమ్ లో సినిమా నిర్మాణవిలువలు గొప్పగా కనిపిస్తున్నాయి. ప్రవీణ్ పూడి తన ఎడిటింగ్ తో మెస్మరైజ్ చేశారు. ది మోస్ట్ టెర్రిఫిక్ కేస్ ఇన్ ద ఇండియన్ హిస్ట్రీ అంటూ.. ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంది. మరీ ఆ కేసేంటో దాన్ని ఎలా చేదించారో తెలుసుకోవాలంటే మే 12 వరకు వెయిట్ చేయాల్సిందే. 
 
చాలా వైవిధ్యమైన కథతో నేటితరం యువతకు నచ్చేలా ది స్టోరి ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ సినిమాను తెరకెక్కించామని, యువతకు కావల్సిన అన్ని అంశాలతో పాటు ఓ మంచి సందేశం ఈ సినిమాలో ఉంటుందని మేకర్స్ తెలిపారు. సినిమా చాలా బాగా వచ్చిందని, మంత్ర సినిమాతో ఛార్మీ కి ఎలాంటి పేరు వచ్చిందో ఈ సినిమాలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అంతే మంచి పేరు వస్తుందని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు. నాన్నకు ప్రేమతో, సీతారామమ్ వంటి సినిమాలను విడుదల చేసిన ప్రతిష్టాత్మకమైన "రిలియాన్స్ ఎంటర్ టైన్మెంట్" సంస్థ "ది స్టోరి ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్" సినిమా చూసి, వారికి ఎంతగానో నచ్చి.. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుల చేస్తుండటం సంతోషంగా ఉందని మేకర్స్ అభిప్రాయపడ్డారు.
 
ఈ సందర్భంగా జెన్ నెక్ట్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై హీరోయిన్ అనుపమకు ఉన్న అనుబంధంతో ది స్టోరి ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ టీమ్ తో ఓ ఇంటర్ వ్యూ కూడా చేసింది. ప్రస్తుతం ఆ ఇంటర్ వ్యూ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ సినిమాపై పాజిటీవ్ అంచనాలు పెంచుతూ.. మంచి బజ్ క్రియేట్ చేస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇండియాలో ప్రైమ్‌ వీడియోలో నేరుగా స్ట్రీమింగ్‌ కానున్న బెన్‌ ఎఫ్లెక్‌ నటించిన AIR