క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ '800'ను ఇండియాలోనే 1100 థియేటర్లలో విడుదల చేస్తున్నామని నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ అన్నారు. ఈ సినిమా రెండేళ్లనాటి అనుకుంటే ముత్తయ్య మురళీధరన్ కెరియర్ లో ఎన్ని అడ్డంకులు వచ్చాయో సినిమాకు వచ్చాయి. కారణం శ్రీలంక వాదులు. అప్పట్లో ఆయన కెరీర్ పై ఎల్.టి.టి. ప్రభావం ఉంది. దానిపై చాలా కష్టాలు పడినట్లు వార్తలు వచ్చాయి. ఆస్ట్రిలియా పర్యటనలో మురళికి అవమానాలు మిగిలాయి. అలా చాలాచోట్ల హర్డిల్స్ వచ్చాయి. ఫైనల్ గా రిటైర్ అవుదామని అనుకునే టైములో 800 వికెట్ తీసాడు. దాంతో ఒక్కసారిగా మరోసారి వెలుగులోకి వచ్చాడు.
- మురళికి జాబ్ వచ్చినా అక్కడా అడ్డంకులే అని 800 సినిమా నిర్మాత తెలిపారు. తెలుగులో పావురు హీరోలకు కథ చెపితే చేయడానికి భయపడ్డారు. దాంతో కొద్దికాలం వాయిదా పడింది. అసలు ముందుగా విజయ్ సేతుపతి గారితో సినిమా తీయాలని అనుకోవడం, తమిళనాడు, శ్రీలంకలో కొంతమంది గొడవ చేయడంతో కాంట్రవర్సీలు వద్దని సేతుపతి గారు తప్పుకోవడం తెలిసిన విషయాలే. అప్పుడు నానికి కథ చెప్పాలని శ్రీపతి ప్రయత్నించారు. అప్పటికి నాని 'జెర్సీ' చేసి ఏడాదిన్నర మాత్రమే అయింది. క్రికెట్ నేపథ్యంలో మరో సినిమా అంటే నాని గారు కూడా ఆలోచించాలి. మురళీధరన్ గారికి నాని అంటే ఇష్టం. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు! నేను కూడా చెప్పడంతో 'కథ వింటాను కానీ సినిమా చేయలేను' అని నాని ముందే చెప్పారు. కథ విన్నాక 'చాలా బాగుంది' అన్నారు.
ఇలా అన్ని కష్టాలు ఎదుర్కొని అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా తెలుగు తమిళ హిందీ భాషల్లో ఆయన విడుదల చేస్తున్నారు.