ప్రభాస్-రానా మధ్య సమరం భారత చలనచిత్ర చరిత్రలోనే అతి పెద్ద క్లైమాక్స్: రాజమౌళి
బాహుబలి-2లో ప్రభాస్-రానా దగ్గుబాటి మధ్య జరిగే సమరం భారతీయ చలన చిత్ర చరిత్రలోనే అతి పెద్ద మరియు అత్యుత్తమ క్లైమాక్స్‌గా నిలిచిపోతుందని సాక్షాత్తూ చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి వెల్లడించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఈ క్లైమాక్స్‌లోని యుద్ధ
బాహుబలి-2లో ప్రభాస్-రానా దగ్గుబాటి మధ్య జరిగే సమరం భారతీయ చలన చిత్ర చరిత్రలోనే అతి పెద్ద మరియు అత్యుత్తమ క్లైమాక్స్‌గా నిలిచిపోతుందని సాక్షాత్తూ చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి వెల్లడించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఈ క్లైమాక్స్‌లోని యుద్ధ దృశ్యాలలోని వీఎఫ్ఎక్స్ రఫ్ డ్రాప్టుపై పని చేస్తున్న బృందం అభిప్రాయం ప్రకారం ఈ చిత్తు దృశ్యాలే ప్రపంచ స్థాయి క్వాలిటీని కలిగి ఉంటున్నాయని పొగిడేస్తున్నారు. పైగా ఈ ఇద్దరి మధ్య యుద్ధం క్లైమాక్స్‌లోనే 45 నిమిషాల పాటు జరగనుందని రాజమౌళి చెప్పడంతో ప్రభాస్, రానా అభిమానులు వెర్రెత్తి పోతున్నారంటే అతిశయోక్తి కాదు.
మరో పది రోజుల్లో బాహుబలి 2 తొలి థియేట్రికల్ ప్రోమోను విడుదల చేయనున్నారు. ఈ ప్రోమో విడుదల కోసం చిత్రనిర్మాతలు భారీ కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తున్నారు. విడుదలకు రెండు నెలల సమయం ఉన్నప్పటికీ బాహుబలి-2 సినిమా గురించిన ప్రచారం తారస్థాయికి చేరుకుంది.
బాహుబలి చిత్ర నిర్మాణంలో పాల్గొంటున్న వర్గాలు తెలుపుతున్న సమాచారం అందరినీ రోమాంచితులను చేస్తోంది. రెండో భాగంలో క్లైమాక్స్‌లో వచ్చే యుద్ధ దృశ్యాలు బాలీవుడ్‌లోనే కనివిని ఎరుగనంత పెద్దస్థాయిలో, అత్యుత్తమ ప్రమాణాలతో ఉంటున్నాయని వీరు చెబుతున్నారు. ప్రస్తుతం టీమ్ ఈ యుద్ధ దృశ్యాలపైనే పని చేస్తోంది. ఫలితం అద్వితీయంగా వస్తోందని వీరు చె్ప్పారు. చిత్రం ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ లోనే ఉంది. క్లైమాక్స్ సీన్ లోని విఎఫ్ఎక్స్ ఎఫెక్టుకు చెందిన చిత్తు పని మాత్రమే ఇప్పుడు జరుగుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ క్లైమాక్స్ ప్రపంచ స్థాయిలో రూపొందిందని చిత్ర వర్గాలు తెలుపుతున్నాయి.
క్లైమాక్స్ ఎంత పెద్దదంటే యుద్ధ సన్నివేశాలే 45 నిమిషాలపాటు సాగుతాయట. సినిమాలోని చివరి 40 నిమిషాలయితే భల్లాల దేవ, బాహుబలి మధ్య యుద్ధంతోనే నడుస్తుందట. పతాక సన్నివేశంలో తన తండ్రిని చంపిన భల్లాల దేవుని బాహుబలి చంపి ప్రతీకారం తీర్చుకుంటాడు.
బాహుబలిని మీరు ఇష్టపడుతుంటే మీ ఆసక్తిని మరింత ఎత్తుకు తీసుకుపోయే వార్త ఇది.
సిద్ధంగా ఉండండి. మీ కళ్లముదు ఒక నిరుపమాన దృశ్య అద్భుత ఆవిష్కరణను తిలకించడానికి సిద్ధంగా ఉండండి. ఆ విజువల్ ఫీస్ట్ కోసం ఆ నేత్రానందం కోసం ఏప్రిల్ 28 దాకా వేచి ఉండండి. అంతవరకు బాహుబలిని వింటూ, తింటూ, తాగుతూ బతికేయండి మరి.