Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గౌతం రాజు కుమారుడు కృష్ణ హీరోగా చిత్రం ప్రారంభం

Gautam Raju, Krishna, Sumita, B. Gopal
, సోమవారం, 22 ఆగస్టు 2022 (16:22 IST)
Gautam Raju, Krishna, Sumita, B. Gopal
ఒక మధ్య తరగతి ప్రేమజంటకు వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని మంచి ప్లాన్ తో చేజిక్కుంచుకొని కోటేశ్వరులు ఎలా అయ్యారు? అనేదే ఈ కథ. రావుల గౌరమ్మ  సమర్పణలో సాయి విలా సినిమాస్  పతాకంపై కృష్ణ (కమెడియన్ గౌతం రాజు కొడుకు), సుమీత  జంటగా  అంజన్ చెరుకూరి  దర్శకత్వంలో  నిర్మిస్తున్న  ప్రొడక్షన్ నెం 2. కొత్త సినిమా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా ప్రారంభం జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ గారు, రేలంగి నరసింహారావు గారు.గౌతం రాజు, ప్రసన్న కుమార్ గారు, రామ సత్య నారాయణ .డి ఎస్ రావు,ఆర్టిస్ట్ మాదవి గారు. తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. 
 
పూజా కార్యక్రమాలు అనంతరం  హీరో,హీరోయిన్లయిన కృష్ణ, సుమీతపై ముహూర్తపు సన్ని వేశానికి  దర్శకుడు బి. గోపాల్ క్లాప్ నివ్వగా, నిర్మాత రామసత్యనారాయణకెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు రేలంగి నరసింహారావు గౌరవ దర్శకత్వం  వహించారు.
 
అనంతరం చిత్ర దర్శకుడు మాట్లాడుతూ,  అశల పల్లకిలో అందరూ ఊగుతూ ఉంటారు.కానీ ఆ ఆశలు తీర్చుకొని ఎలా కోటీశ్వరులు అయ్యారు అనేదే ఈ సినిమా కథ.  రాజమౌళి గారు నిర్మాతలు ఇచ్చిన బడ్జెట్ లో మిగిల్చి ఇవ్వడం అలవాటు. నేను అదే ఫాలో అవుతున్నాను.. నిర్మాతలకు నేను చెప్పిన కథ నచ్చడంతో దర్శకుడిగా ఈ సినిమా చేసే అవకాశం కల్పించారు వారికి.ధన్యవాదాలు తెలిపారు.
 
చిత్ర నిర్మాతలు లక్ష్మణ్  రావు., శ్రీనివాస్ ట్లాడుతూ ...మా అభిమాన నటుడు  మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్ డే  రోజు మా సినిమాను ప్రారంభించు కోవాలనుకొని ఈ రోజు సినిమా మొదలు పెట్టాము. మా మొదటి సినిమా రుద్రవీణ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ కథ నచ్చడంతో మా రెండవ  ప్రాజెక్టు గా ఈ సినిమా తీస్తున్నాము. సెప్టెంబర్ నుండి రెగ్యులర్ షూట్ కు వెళ్తున్నాము మంచి కథతో  వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులందరికీ మెప్పు పొందేలా ఉంటుంది అన్నారు.
 
హీరో కృష్ణ మాట్లాడుతూ.. నా ఐదవ సినిమాకు బి. గోపాల్, రేలంగి నరసింహరావు వంటి లెజెండ్స్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్ర నిర్మాతలు నన్ను, దర్శకుడిని నమ్మి ఈ సినిమా చేయడానికి  ముందుకు వచ్చారు. వారు మా పై పెట్టిన నమ్మకాన్ని నిలుపుకుంటామని  తెలుపుకుంటున్నాను అన్నారు
 
కమెడియన్ గౌతం రాజు మాట్లాడుతూ.. ,మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు మా అబ్బాయి సినిమా ప్రారంభం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. నిర్మాత లక్ష్మణ్ డేరింగ్ పర్సన్. తన మెదటి సినిమా రిలీజ్ కాకముందే రెండవ సినిమా మొదలుపెట్టాడు. దర్శకుడు కూడా మంచి కథను సెలెక్ట్ చేసుకున్నారు. ఈ సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.
 
ప్రముఖ జర్నలిస్ట్ వినాయక్ రావు గారు మాట్లాడుతూ.. గౌతం రాజు గారు తన కొడుక్కి కృష్ణ  అనే  మంచి పేరు పెట్టాడు. హీరో కృష్ణ మంచి సినిమాలు చేస్తూ సూపర్ స్టార్ కృష్ణ అంతటి స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు ఇంకా నిర్మాత రామ సత్య నారాయణ, డి ఎస్ రావు, హీరోయిన్ సుమీత మాట్లాడారు.
 
సాంకేతిక నిపుణులు-  సమర్పణ : రావుల గౌరమ్మ, నిర్మాతలు : రావుల లక్ష్మణ్ రావ్, రావుల శ్రీను, స్టోరీ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: అంజన్ చెరుకూరి, కెమెరా- ఎస్. రాజశేఖర్,  సంగీతం: త్రినాథ్ మంతెన,ప్రొడక్షన్ మేనేజర్ : శ్రీ రాములు, పి ఆర్. ఓ : టి. యస్. యన్. మూర్తి

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాగ శౌర్య హీరోగా నూత‌న చిత్రం ప్రారంభం