'కళాతపస్వి' విశ్వనాథ్‌కు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం
కళాతపస్వి కె. విశ్వానాథ్ కు దాదా సాహెబ్ ఫాల్కె అవార్డు వరించింది. సినీ రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం ఆయనకు 2016 సంవత్సరానికి గాను కేంద్రం ఎంపిక చేసింది. ఈ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా వచ్చే నెల 3న ప్రదానం చేయనున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో
కళాతపస్వి కె. విశ్వానాథ్ కు దాదా సాహెబ్ ఫాల్కె అవార్డు వరించింది. సినీ రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం ఆయనకు 2016 సంవత్సరానికి గాను కేంద్రం ఎంపిక చేసింది. ఈ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా వచ్చే నెల 3న ప్రదానం చేయనున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో దృశ్య కావ్యాలను తెరకెక్కించిన విశ్వనాథ్ పలు జాతీయ పురస్కారాలతో పాటు నంది అవార్డులు కూడా అందుకున్నారు.
ఆయన ఖాతాలో శంకరాభరణం, స్వాతిముత్యం, సిరివెన్నెల, సిరిసిరిమువ్వ, స్వర్ణకమలం, సాగర సంగమం, శృతిలయలు, స్వయంకృషి, సూత్రధారులు తదితర చిత్రాలున్నాయి. ఫాల్కే పురస్కారానికి ఎంపిక కావడం అదృష్టంగా భావిస్తున్నాననీ, తన తల్లిదండ్రుల దీవెనలు ఫలించాయని విశ్వనాథ్ అన్నారు.