వంగీవీటి, జార్జిరెడ్డి చిత్రాల హీరో సందీప్ మాధవ్ తను దగ్గరకు వచ్చిన కథలను రిజెక్ట్ చేస్తున్నారు. దాంతో కెరీర్ స్లోగా సాగిపోతుంది. ఈ విషయమే ఆయన స్పందిస్తూ, అవును స్లోగానే వెళుతున్నా. మధ్యలో కరోనా వల్ల గేప్ తీసుకున్నా. ఆ తర్శాత కథలు సెట్ చేసుకోవడంలో గేప్ వచ్చింది. ఇప్పుడు ఫాస్ట్‌గా చేస్తున్నాను. వంగీవీటి, జార్జిరెడ్డి చేశాక ఏది బడితే అది చేయడంలేదు. నాకు సూటయ్యేవి చేస్తున్నా. లవ్‌స్టోరీ కథలు చాలా వచ్చాయి. అందులో 16 ఏళ్ళ కుర్రాడి పాత్ర చేయమన్నారు. నాకు సూట్ కాదు అంటే, మీకెందుకు మీరు చూస్తూవుండడి మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళతాం అంటూ కొందరు నాకు భరోసాలాగా చెప్పారు. దాంతో నాకు అనుమానం వచ్చింది. నాకోసం ఇంత రిస్క్ చేస్తున్నారా? నన్నే రిస్క్‌లో పడేస్తున్నారా! అనేది అర్థంకాక రిజెక్ట్ చేశానంటూ మనసులోని మాటను తెలియజేశారు.
- నాకు సైన్స్ ఫిక్షన్, యాక్షన్ అంటే ఇష్టం. వ్యక్తిగతంగా కామెడీ ఇష్టం. తాజాగా `మాస్ మహరాజ్` అనే సినిమా చేస్తున్నా. రాజ్‌తరుణ్ కూడా ఇందులో వున్నాడు. అందులో కూడా 50 ఏళ్ళ వ్యక్తిగా చేస్తున్నా. అసీఫ్‌ఖాన్, ప్రదీప్ రాజు నిర్మాతలు. కోతలరాయుడు చేసిన సుధీర్ రాజా దర్శకుడు. ఇది పెద్ద కమర్షియల్ సినిమా అవుతుంది అని చెప్పారు. ఇప్పుడు సందీప్ మాదవ్ గంధర్వ అనే సినిమా చేశాడు. జులై 1న విడుదలకాబోతోంది.