ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. యేడాది తిరగకముందే టీవీ నటుడు ఆత్మహత్య?
గత యేడాది ఆగస్టు నెలలో ప్రేమ వివాహం చేసుకున్న బుల్లితెర నటుడు ప్రదీప్ బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం వేకువజామున 4 గంటల సమయంలో అతను బలవన్మరణానికి పాల్పడినట్టు సమాచారం.
గత యేడాది ఆగస్టు నెలలో ప్రేమ వివాహం చేసుకున్న బుల్లితెర నటుడు ప్రదీప్ బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం వేకువజామున 4 గంటల సమయంలో అతను బలవన్మరణానికి పాల్పడినట్టు సమాచారం.
హైదరాబాద్, పుప్పాలగూడ అల్కాపురి కాలనీ గ్రీన్ ఇకానియా అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన జరిగింది. ప్రదీప్ ఆత్మహత్య ప్రస్తుతం మిస్టరీగా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలిస్తున్నారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రదీప్ భార్య పావని రెడ్డిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈమె కూడా టీవీ నటే. వీరిద్దరు గతయేడాది ఆగస్టులో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రదీప్ 'సప్తమాత్రిక' అనే సీరియల్‌లో, పావని అగ్నిపూలు అనే సీరియల్‌లో నటిస్తోంది.
కాగా, ఇటీవలి కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమ లేదా బుల్లితెరకు చెందిన నటీనటులు ఆత్మహత్యలు చేసుకోవడం ఎక్కువైంది. యువ నటుడు ఉదయ్ కిరణ్, ఆ తర్వాత ఆర్తి అగర్వాల్ ఇలా అనేక మంది యువ నటీనటులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.