సినిమాగా "అతడు అడవిని జయించాడు" నవల
ప్రముఖ తెలుగు రచయిత డా.కేశవరెడ్డి గారి నవల అతడు అడవిని జయించాడు ప్రపంచవ్యాప్త సినిమా నిర్మాణ హక్కులను హక్కులకు డిఎస్‌ఎన్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ సొంతం చేసుకుంది. అంతర్జాతీయ ఫిలింమేకర్ దూలం సత్యనారాయణ ద
ప్రముఖ తెలుగు రచయిత డా.కేశవరెడ్డి గారి నవల అతడు అడవిని జయించాడు ప్రపంచవ్యాప్త సినిమా నిర్మాణ హక్కులను హక్కులకు డిఎస్‌ఎన్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ సొంతం చేసుకుంది. అంతర్జాతీయ ఫిలింమేకర్ దూలం సత్యనారాయణ దర్శకత్వంలో పలు చిత్ర నిర్మాణ సంస్థల భాగస్వామ్యంతో ఈ ప్రఖ్యాత నవలను సినిమాగా రూపొందించడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా దూలం సత్యనారాయణ మాట్లాడుతూ అతడు అడవిని జయించాడు తెలుగు సాహిత్యంలో గొప్ప నవలగా అశేష పాఠకుల ఆదరణ చూరగొంది. అంతర్జాతీయ స్థాయి సినిమాగా రూపొందించే సత్తా ఈ నవలలో వుంది. భారీ బడ్జెట్‌తో అత్యాధునిక టెక్నాలజీని మేళవించి ఆస్కార్, కాన్స్, లొకర్నో, బెర్లిన్, టొరంటో, బుసాన్ వంటి అంతర్జాతీయ సినిమా వేదికల మీద పోటీ పడేలా ఈ సినిమా నిర్మాణాన్ని చేపడుతాం.
ఇప్పటికే హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో చర్చలు జరుపుతున్నాం అన్నారు. కాగా దూలం సత్యనారాయణ ఇప్పటివరకు అనేక అంతర్జాతీయ డాక్యుమెంటరీలను రూపొందించాడు. ఇటీవలే తెలంగాణ టూరిజం ఫిలింకి పోర్చుగల్‌లో ఇంటర్నేషనన్ అవార్డుని సాధించారు.