Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలకృష్ణను సత్కరించిన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులు

Advertiesment
balakrishna

ఠాగూర్

, ఆదివారం, 9 ఫిబ్రవరి 2025 (13:24 IST)
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు విశేష సేవలు అందించిన ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం కాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణకి భారత ప్రభుత్వం ఇటీవల పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించిన విషయం తెల్సిందే. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు నందమూరి బాలకృష్ణ నివాసానికి వెళ్లి ఆయనకు అభినందనలు తెలిపారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పి.భరత్ భూషణ్, సెక్రటరీ కె.ఎల్ దామోదర్ ప్రసాద్, కోశాధికారి తుమ్మల ప్రసన్న కుమార్, అలాగే తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కె.ఎల్.దామోదర్ ప్రసాద్, సెక్రటరీ తుమ్మల  ప్రసన్న కుమార్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ సెక్రటరీ కె అనుపమ్ రెడ్డి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కుమార్, సెక్రటరీ కె అమ్మిరాజు, కోశాధికారి వి సురేష్‌లు ఉన్నారు. 
 
అలాగే, తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్ సెక్రెటరీ ఉమర్జీ అనురాధ, తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ ప్రెసిడెంట్ కె అమ్మిరాజు, చిత్రపురి హిల్స్ ప్రెసిడెంట్ మరియు తెలుగు సినీ, టీవీ జూనియర్ ఆర్టిస్ట్స్ యూనియన్ సెక్రటరీ వల్లభనేని అనిల్ కుమార్, తెలుగు సినీ,టీవీ అవుట్ డోర్ యూనిట్ టెక్నిషన్స్ యూనియన్ సెక్రటరీ వి సురేష్, తెలుగు సినీ స్టంట్ డైరెక్టర్స్ మరియు స్టంట్ ఆర్టిస్ట్స్ యూనియన్ కోశాధికారి రమేష్ రాజా, మొత్తం ఇండస్ట్రీ నుండి 10 అసోసియేషన్స్ అండ్ యూనియన్స్ కలిసి నందమూరి బాలకృష్ణని కలసి ఆయనకు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. త్వరలో నందమూరి బాలకృష్ణ గారిని సన్మానించేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు వారు సూచన ప్రాయంగా వెల్లడించారు. 
 
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... “నందమూరి బాలకృష్ణ నటుడిగానే కాదు, సినీ పరిశ్రమకు, సేవా కార్యక్రమాలకు చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కడం ఎంతో గర్వించదగ్గ విషయం” అని అన్నారు. పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ... “ఈ అవార్డు నాకు, మా కుటుంబానికే కాదు, తెలుగు సినీ పరిశ్రమకు వచ్చిన గౌరవం. ఇది నాకు మరింత బాధ్యతను పెంచింది” అని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుష్ప హిట్ క్రెడిట్ అంతా సుకుమార్‌దే, అల్లు అర్జున్‌లో ఎస్.వి. రంగారావ్ ఉన్నాడు