Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బోయపాటి సినిమాలో అల్లు అర్జున్-ఎన్టీఆర్ కామియో రోల్స్.. నెట్లో ALLU ARHAకు లైక్స్ వర్ష..

మాస్ సినిమాల్లో బోయపాటి సీను ప్రత్యేక మార్కు వేసుకున్నాడు. సరైనోడు సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న బోయపాటి ప్రస్తుతం యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌తో కమర్షియల్ ప్రాజెక్ట్ చేస్తు

Advertiesment
బోయపాటి సినిమాలో అల్లు అర్జున్-ఎన్టీఆర్ కామియో రోల్స్.. నెట్లో ALLU ARHAకు లైక్స్ వర్ష..
, శనివారం, 31 డిశెంబరు 2016 (17:12 IST)
మాస్ సినిమాల్లో బోయపాటి సీను ప్రత్యేక మార్కు వేసుకున్నాడు. సరైనోడు సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న బోయపాటి ప్రస్తుతం యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌తో కమర్షియల్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. స‌రైనోడు వంటి ఇండ‌స్ట్రీ హిట్ త‌ర్వాత డైరెక్ట‌ర్ బోయపాటిశ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ప్ర‌స్తుతం విశాఖ‌ప‌ట్నంలో సెకండ్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది.
 
ఈ చిత్రంలో శరత్ కుమార్ కీలక రోల్‌లో కనిపిస్తారని.. మరో పాత్రలో జగపతిబాబు నటించనున్నారు. రకుల్, ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్న ఈ చిత్రంలోని ఓ పాట కోసం భారీ సెట్ వేశారు. అన్నపూర్ణ స్టూడియోలో 3 కోట్ల ఖర్చుతో చాలా లాషిగ్ గా ఓ సెట్ ని రూపొందించారట. ఆ సెట్ లో రకుల్, బెల్లంకొండ శ్రీనివాస్‌తో కలిసి స్టెప్పులేయనుందట. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో ముఖ్య విషయమేమంటే పేరు పెట్టని ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ కామియో రోల్‌లో కనిపించనున్నారని టాలీవుడ్ వర్గాల సమచారం. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చుతున్నాడు. 
 
ఇకపోతే.. స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ స్నేహ దంపతులకి నవంబర్ 21 న రెండవ సంతానంగా ఓ బుజ్జి పాపాయి పుట్టిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ పాప కి సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్లో హల్ చల్ చేస్తోంది. క్రిస్మస్ సందర్భంగా అల్లు అర్జున్ తన ముద్దుల కుమార్తె ఫోటోను విడుదల చేశాడు. విడుదలైన ఐదు రోజులకే ఈ ఫోటోకు భారీ లైక్స్ వెల్లువెత్తుతున్నాయి. 
 
తన ముద్దుల కూతురికి అల్లు అర్జున్ ఒక అందమైన పేరు పెట్టాడు. ఇప్పుడు తమ ముద్దుల పాపకి అల్లు అర్హ ALLU ARHA అని నామకరణం చేసినట్లు చెప్పుకొచ్చాడు. తన పేరు, తన భార్య పేరు కలసి వచ్చేలా ఆ పేరు ఉందని చెప్పాడు. Arjunలో AR, Snehaలో HAలను కలిపి ARHA (అర్హా) అని పేరు పెట్టినట్టుగా వివరించాడు. అంతేకాదు.. అర్హా అంటే.. హైదవంలో శివుడు అని, ఇస్లాంలో.. శాంతి, నిర్మలం అనే అర్థాలు వస్తాయని అల్లు అర్జున్ చెప్పాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియాంక చోప్రాకు అరుదైన గౌరవం.. ఆస్కార్ తర్వాత గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా...?