Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రామ్ చరణ్ 'ధృవ' ప్రి-రిలీజ్ ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా కేటీఆర్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ 'ధృవ' చిత్రం ప్రి-రిలీజ్ ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా తెలంగాణ ఐటీ శాఖామంత్రి కె.టి. రామారావు పాల్గొననున్నట్లు టాలీవుడ్ సమాచారం. ఈ చిత్రం ప్రి-రిలీజ్ ఫంక్షన్ హైదరాబాదులోని యూసఫ్‌గూడ పోలీస్ లైన్స్‌లో డిసెంబరు 4వ తేదీన జరుగనున

Advertiesment
రామ్ చరణ్ 'ధృవ' ప్రి-రిలీజ్ ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా కేటీఆర్
, బుధవారం, 30 నవంబరు 2016 (16:52 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ 'ధృవ' చిత్రం ప్రి-రిలీజ్ ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా తెలంగాణ ఐటీ శాఖామంత్రి కె.టి. రామారావు పాల్గొననున్నట్లు టాలీవుడ్ సమాచారం. ఈ చిత్రం ప్రి-రిలీజ్ ఫంక్షన్ హైదరాబాదులోని యూసఫ్‌గూడ పోలీస్ లైన్స్‌లో డిసెంబరు 4వ తేదీన జరుగనున్న సంగతి తెలిసిందే. 
 
ఇటీవల హైదరాబాదులో 10కె రన్ సందర్భంగా రామ్ చరణ్, కేటీఆర్ ఇద్దరూ కలిసి పాల్గొన్నారు. ఈ నేపధ్యంలో కేటీఆర్‌ను ప్రి-రిలీజ్ ఫంక్షనుకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. కేటీఆర్ రాకతో చరణ్ సినిమా ఫంక్షన్ మరింత గ్రాండ్ గా మారనుంది. 
 
ఈ చిత్రంలో రామ్ చరణ్ తేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. అరవింద స్వామి కీలక పాత్రలో నటిస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'చిరు'ను ఆటపట్టించిన ఆ ముగ్గురు హీరోయిన్లు.. జ్ఞాపకాలు ఎప్పుడూ తియ్యగానే ఉంటాయి...