Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రెండేళ్లు పూర్తి చేసుకున్న తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్

ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు విడిపోయాక ఎంతో మంది చాంబర్స్ ఏర్పాటు చేయాలని, ప్రయత్నించినప్పటికీ తెలంగాణ రాష్ట్ర సినిమా సెన్సార్ క్లియరెన్స్, టైటిల్ రిజిస్ట్రేషన్ పర్మిషన్ సాధించటంలో ప్రతాని రామకృష్ణ గౌడ్ ఎ

Advertiesment
telangana film chamber of commerce
, మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (16:50 IST)
ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు విడిపోయాక ఎంతో మంది చాంబర్స్ ఏర్పాటు చేయాలని, ప్రయత్నించినప్పటికీ తెలంగాణ రాష్ట్ర సినిమా సెన్సార్ క్లియరెన్స్, టైటిల్ రిజిస్ట్రేషన్ పర్మిషన్ సాధించటంలో ప్రతాని రామకృష్ణ గౌడ్ ఎన్నో కష్టాలకోర్చారు. అనుకున్నట్టుగానే టి.ఎఫ్.సి.సి ని సాధించారు. రెండు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేయటం కొన్ని సినిమాలకు సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వటం కూడా జరిగింది. ఈ మధ్యే టి.ఎఫ్.సి.సి. కొత్త జనరల్ బాడీని ఎన్నుకోవటం జరిగిందని పాత్రికేయుల సమావేశం ఏర్పాటుచేశారు. తమ తదుపరి కార్యాచరణ వివరాలు తెలిపారు.
 
ఈ కార్యక్రమానికి టి.ఎఫ్.సి.సి ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్, వైస్ ఛైర్మన్ రంగా రవీంద్ర గుప్త, సెక్రటరీ లయన్ సాయి వెంకట్ పాల్గొన్నారు. టి.ఎఫ్.సి.సి చైర్మన్ ప్రతాని రామ కృష్ణ గౌడ్ మాట్లాడుతూ... టి.ఎఫ్.సి.సి ఏర్పాటుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రోత్సాహం మర్చిపోలేనిది. అలాగే కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, దత్తాత్రేయ, రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మద్దతు మర్చిపోలేనిది. 
 
టి.ఎఫ్.సి.సిలో 1000 మంది నిర్మాతలు. 24 క్రాఫ్ట్స్‌లో సుమారు 3000 సభ్యులు ఉన్నారు. వీరందరికి హెల్త్ కార్డ్స్ (కేంద్ర ప్రభుత్వ హెల్త్ స్కీమ్) ఇప్పించటం జరుగుతుంది. అలాగే వారి పిల్లలకు స్కాలర్‌షిప్‌లు కూడా ఇప్పిస్తాం. ఈ స్కీమ్ ఫామిలీ మొత్తానికి వర్తిస్తుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అలాగే తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీస్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రిజిస్ట్రేషన్ కూడా వచ్చింది. కె.సి.ఆర్. సినిమా పరిశ్రమపై త్రిసభ్య కమిటీ వేశారు. వారిలో కె.టి.ఆర్, తుమ్మల నాగేశ్వరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ ముగ్గురు మేము చెప్పిన సమస్యలని పరిష్కరించబోతున్నారు. 
 
వాటిలో చిన్న సినిమాలకు 5 ఆటలు, చిత్రపురి కాలనీలో ఇల్లు లేనివారికి 9 ఎకరాలు కేటాయించటం జరిగింది. ప్రభుత్వం తరుపున ఫిలిం ఇనిస్టిట్యూట్ ఏర్పాటు వంటివి చర్చించడం జరిగింది. ఇక జీవో రావటమే ఆలస్యం. సినిమా పరిశ్రమకు ముఖ్యమంత్రి చేస్తున్న కృషి ఎందరో కార్మికుల్లో సంతోషాన్ని నింపుతుందని, ఈసందర్భంగా కేసీఆర్‌కు కృతఙ్ఞతలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెద్ద నోట్ల రద్దు కథాంశంతో "ఏటీఎం"