Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గాంధీ - మండేలాకు ఏమాత్రం తీసిపోని నేత కేసీఆర్... జీవిత చరిత్ర ఆధారంగా సినిమా...

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ జీవిత చరిత్రపై తెలంగాణకు చెందిన నిర్మాతలు మధురశ్రీధర్‌, రాజ్‌ కందుకూరి సంయుక్తంగా ఓ సినిమాను నిర్మించనున్నారు. ఈ విషయాన్ని మధురశ్రీధర్‌ గురువారం పత్రి

Advertiesment
Telangana CM KCR Biopic
, గురువారం, 20 అక్టోబరు 2016 (15:09 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ జీవిత చరిత్రపై తెలంగాణకు చెందిన నిర్మాతలు మధురశ్రీధర్‌, రాజ్‌ కందుకూరి సంయుక్తంగా ఓ సినిమాను నిర్మించనున్నారు. ఈ విషయాన్ని మధురశ్రీధర్‌ గురువారం పత్రికా ప్రటకన విడుదల చేశారు.
 
కొందరు ఆయన్ని స్వరాష్ట్ర స్వాప్నికుడన్నారు. కొందరు తెలుగువారి మధ్యలో చిచ్చుపెట్టిన ప్రాంతీయవాది అన్నారు. కొందరు ఆయన్ని ప్రజాస్వామిక వ్యవస్థలో నియంత అన్నారు. కొందరు నియంతృత్వ ధోరణులున్న ప్రజాస్వామ్య రక్షకుడన్నారు. కొందరు ఆయాన్ని పోరాటశక్తి అన్నారు. కొందరు కేవలం ఆరాటపరుడు అన్నారు. కొందరు ఆయన్ని రాజనీతి విద్వాంసుడన్నారు. కానీ 4 కోట్ల తెలంగాణా ప్రజలకు ఆయన ఒక ఆశయ సారధి... వారి కలలను నిజం చేసిన మహా నాయకుడు.
 
ఎవరు ఏమన్నా, ఎవరు ఎలా అనుకున్నా, ఉద్యమంలో ఆయన ముందుకు సాగారు. ఇదంతా మనమందరం చూసిన చరిత్ర. చూస్తున్న వర్తమానం. కేసీయార్‌ అనే మూడక్షరాలు తెలంగాణ ఉద్యమానికి ఎప్పుడైతే చిరునామాగా మారాయో, దేశం మొత్తం ఉద్యమాన్ని ఒక సానుకూల ధోరణిలో చూడటం మొదలు పెట్టింది.
 
1969 తెలంగాణా ఉద్యమంలో పాల్గొన్న మా నాన్న చెప్పే సంగతులు వింటూ పెరిగిన నేను, విన్న ఆనాటి సంగతులు, చూసిన ఈనాటి సంఘటనలు నాలో ఉన్న దర్శకుడిని కొన్నాళ్లుగా నిద్రపోనీయలేదు. ఆ క్రమంలో కొన్ని పరిశోధనలు చేశాను. తెలంగాణా, సమైక్యాంధ్ర ఉద్యమకారుల్ని విడివిడిగా కలిసాను. కొందరి మాటల ద్వారా ఎన్టీయార్‌, చంద్రబాబు నాయుడు, వై.ఎస్‌ ఆర్‌, సోనియా గాంధీ, చిరంజీవి, లగడపాటి రాజగోపాల్‌, వెంకయ్య నాయుడు, అద్వానీ ఇంకా పవన్‌ కళ్యాణ్‌లను అడిగి తెలంగాణా ఉద్యమాన్ని అర్థం చేసుకున్న తీరు తెలుసుకున్నాను.
 
మహాత్మా గాంధీ, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌, నెల్సన్‌ మండేలాలకు ఏమాత్రం తీసిపోని అత్యంత సంక్లిష్టమైన, భయంకరమైన సవాళ్లు కేసీయార్‌ ఎలా ఎదుర్కున్నారనే విషయాలు తెలుసుకున్నాక ఇక ఈ చరిత్రని తెరపైకి ఎక్కించాల్సిందేనని ఒక దర్శకుడిగా నిర్ణం తీసుకున్నాను. 2017 జూన్‌ 2న తెలంగాణా ఆవిర్భావ దినోత్సవాన షూటింగ్‌ మొదలుపెట్టి, 2018 ఫిబ్రవరి 17న కేసీఆర్ జన్మదినం సందర్భంగా రిలీజ్‌ చేయబోతున్నట్టు చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇండస్ట్రీకి మరో బాబు వచ్చాడు... ఈ బాబు డాన్స్ ఇరగదీశాడట!