దర్శకేంద్రుడిపై నటి విపరీత వ్యాఖ్యలు.. వెకిలి నవ్వులు... ఎవరా హీరోయిన్? (Video)
తెలుగు చిత్రపరిశ్రమలోని గొప్ప దర్శకుల్లో ఒకరు కె. రాఘవేంద్రరావు. దర్శకేంద్రుడిగా గుర్తింపు పొందారు. ఎంతో మంది హీరోయిన్లను టాలీవుడ్‌కు పరిచయం చేసిన ఘనత ఆయనసొంతం. అనేక మంది హీరోలు, హీరోయిన్లకు లైఫ్ ఇచ్చ
తెలుగు చిత్రపరిశ్రమలోని గొప్ప దర్శకుల్లో ఒకరు కె. రాఘవేంద్రరావు. దర్శకేంద్రుడిగా గుర్తింపు పొందారు. ఎంతో మంది హీరోయిన్లను టాలీవుడ్‌కు పరిచయం చేసిన ఘనత ఆయనసొంతం. అనేక మంది హీరోలు, హీరోయిన్లకు లైఫ్ ఇచ్చిన డైరెక్టర్. అలాంటి వ్యక్తిపై హీరోయిన్ తాప్సీ విపరీత వ్యాఖ్యలు చేశారు. వెకిలి నవ్వులు నవ్వింది. సమాజాన్ని పట్టిపీడిస్తోన్న ఏదో సామాజిక రుగ్మత మీద మాట్లాడుతున్నట్లు మాట్లాడి టాలీవుడ్ సినీ ప్రముఖులకు, అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.
ఓ షోలో పాల్గొన్న ఆమె... రాఘవేంద్ర రావువంటి గొప్ప దర్శకుడిపై వ్యాఖ్యలు చేస్తంటే ఆమె పక్కన ఉన్న ఇతర బాలీవుడ్ నటులు వెక్కిరింపుల ధోరణితో నవ్వారు. ఏదో ఓ కామెడీ కథ చెబుతున్నట్లు తాప్సీ టాలీవుడ్‌పై, దర్శకేంద్రుడిపై తన స్థాయి మరచి మరీ సెటైర్లు వేసింది.
కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన 'ఝమ్మంది నాదం' చిత్రం ద్వారా వెండితెరకు తాప్సీ పరిచయమైంది. ఆ సమయంలో తన బొడ్డుపై పూలు, పండ్లు, కొబ్బరికాయలు విసిరారంటూ తాప్సీ హేళనగా మాట్లాడింది. తన మొదటి సినిమా డైరెక్టర్ తీరుతో తనకు భయమేసిందని వ్యాఖ్యానించింది. హీరోయిన్ల బొడ్డుపై పూలు, పండ్లు విసిరే రాఘవేంద్రరావు వంటి దర్శకత్వంలోనే శ్రీదేవి, జయప్రద, జయసుధ వంటి అగ్రహీరోయిన్లు కూడా నటించారని తెలిపింది.
కానీ, తనపై మాత్రం తొలిరోజే టెంకాయ విసిరారని గట్టిగా నవ్వింది. స్క్రీన్‌పై ఆ సినిమాలోని ఓ పాటను చూపిస్తూ హేళన చేసింది. అసలు దక్షిణాది సినిమాల్లో హీరోయిన్స్‌ను కేవలం గ్లామర్‌కు మాత్రమే పరిమితం చేస్తారని ఆమె తీవ్ర ఆరోపణ చేసింది. ఈ షోకు సంబంధించిన ఓ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారుతోంది. దర్శకేంద్రుడిపై తాప్సీ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండిపడుతున్నారు.