Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గేమ్ ఓవర్’ విజయం వాళ్ల‌దే... ఇంత‌కీ ఎవ‌రిది ఈ విజ‌యం..?

గేమ్ ఓవర్’ విజయం వాళ్ల‌దే... ఇంత‌కీ ఎవ‌రిది ఈ విజ‌యం..?
, శనివారం, 22 జూన్ 2019 (20:07 IST)
కథానాయిక ‘తాప్సి’ ప్రధాన పాత్రలో ప్రముఖ తెలుగు,తమిళ చిత్రాల నిర్మాణ సంస్థ ‘వై నాట్ స్థూడియోస్’ నిర్మించిన ‘గేమ్ ఓవర్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1200కు పైగా స్క్రీన్స్‌లో తెలుగు, తమిళం, హిందీ భాషలలో జూన్ 14 న విడుదలై అటు ప్రేక్షకుల చేత, ఇటు సినీ విమర్శకుల చేత ప్రశంసలు అందుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది, రెండవ వారంలో అడుగిడి అటు కలెక్షన్ల పరంగానూ, ప్రశంసల పరంగానూ ముందుకు దూసుకు వెళుతోంది అని చిత్ర నిర్మాతలు ఎస్.శశికాంత్, చక్రవర్తి రామచంద్ర తెలిపారు.
 
ఇది ప్రేక్షకుల విజయం అన్నారు. చిత్రం పబ్లిసిటీ ప్రారంభమైన నాటినుంచే టీజర్, సినిమా థియేట్రికల్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అనూహ్యమైన స్పందన లభించటం, మూడు భాషల్లోని నటీనటులు, రచయితలు, దర్శకులు చిత్ర ప్రముఖుల ప్రశంశలు, ప్రముఖ బాలీవుడ్  రచయిత, దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ చిత్రానికి హిందీలో సమర్పకుడుగా వ్యవహరించటం, భారతీయ సినీ చరిత్రలో ఎప్పుడు రాని సరికొత్త కధాంశంతో ఈ చిత్రం తెరకెక్కటం,’ ఇంతవరకు ఎప్పుడూ ఎక్కడా చూడని కథని ఇది’ అని చాలామంది చెబుతుంటారు. 
 
కానీ ఇంత ఒరిజినల్‌ స్టోరీని, ఇంత ఇన్నోవేటివ్‌గా ఈమధ్య అయితే ఎవరూ చెప్పలేదు దర్శకుడు అశ్విన్ శరవణన్ చిత్ర కథను తెరకెక్కించిన తీరు, అలాగే రోన్ ఏతాన్ యోహాన్ నేపధ్య సంగీతం కూడా చిత్ర విజయానికి కారణం అని తెలిపారు. వీటన్నిటితోపాటు నాయిక ‘తాప్సి’ అద్భుతమైన నటన, తాప్సీ నటిగా చాలా పరిణితి సాధించింది. 
 
ముఖ్యంగా స్ట్రాంగ్‌ విల్‌ చూపించే పాత్రల్లో మెప్పిస్తోంది అన్నారు. మూడు భాషల్లో ‘గేమ్ ఓవర్’ విజయం సాధించటం తమ సంస్థ పై బాధ్యత మరింత గా పెరిగినట్లు తెలుపుతూ, సంస్థ సభ్యులందరికీ అభినందనలు, కృతఙ్ఞతలు తెలిపారు నిర్మాతలు ఎస్.శశికాంత్, చక్రవర్తి రామచంద్ర. మూడు భాషల్లో చిత్రం విజయం సాధించింది కాబట్టి ఈ విజయాన్ని ఒకే వేదికపై ఘనంగా నిర్వహించాలనే ఆలోచన ఉన్నట్లు తెలిపారు.తమ సంస్థ గతంలో తెలుగులో నిర్మించిన ‘లవ్ ఫెయిల్యూర్’,‘గురు’ చిత్రాల విజయాల సరసన ఈ ‘గేమ్ ఓవర్’  నిలవటమే కాక హ్యాట్రిక్ సాధించిందని అన్నారు. 
 
తెలుగులో త్వరలోనే స్టార్ హీరోలతోనూ కథాబలం కలిగిన చిత్రాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. వీటి వివరాలు త్వరలోనే మీడియా ద్వారా తెలియ చేయటం జరుగుతుంది అన్నారు.కథానాయిక ‘తాప్సి’ స్పందిస్తూ.. ‘గేమ్ ఓవర్’ ప్రేక్షకులకు ఓ సరికొత్త ధ్రిల్లింగ్ ను కలిగిస్తుందని చిత్రం విడుదలకు ముందు తెలిపాను. ఇప్పుడది నిజమైంది. అందరూ నా నటనను మెచ్చుకుంటున్నారు.దీనికి కారణం దర్శకుడు అశ్విన్ శరవణన్ నాపాత్రను తెరకెక్కించిన తీరు. 
 
ఓ మంచి చిత్రంలో నటించే అవకాశం కల్పించిన చిత్ర నిర్మాతకు కృతఙ్ఞతలు, మరియు చిత్ర విజయానికి అభినందనలు అన్నారు. తాను గతంలో రూపొందించిన నాయిక నయనతార ‘మయూరి’ చిత్రం తెలుగు నాట గుర్తింపును తెస్తే ఈ ‘గేమ్ ఓవర్’ చిత్రం ఎంతో కీర్తిని తెచ్చిపెట్టింది. చిత్రాన్ని ఆదరిస్తూ, అభినందనలు కురిపిస్తున్న తెలుగు ప్రేక్షకులకు హృదయ పూర్వక కృతఙ్ఞతలు.ఈ విజయంతో మరింత బాధ్యతగా మంచి కధా బలం కలిగిన చిత్రాలను రూపొందిస్తానని తెలిపారు చిత్ర దర్శకుడు అశ్విన్ శరవణన్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వామ్మో వాన... హైదరాబాద్ ట్రాఫిక్ జాం... దాన్నెక్కడం బాగుంది: నితిన్ ట్వీట్