'నిత్య సత్యాన్వేషి - అర్జునుని వంటి ఒక అజ్ఞాతవాసి' : తనికెళ్ల భరణి
హీరో పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం అజ్ఞాతవాసి. ఈ చిత్రం వచ్చే నెల పదో తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రం ఆడియో వేడుక మంగళవారం రాత్రి జరిగింది.
హీరో పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం అజ్ఞాతవాసి. ఈ చిత్రం వచ్చే నెల పదో తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రం ఆడియో వేడుక మంగళవారం రాత్రి జరిగింది.
ఇందులో ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ, 'నేను మూడే ముక్కలు మాట్లాడతాను. ఒకటి.. పవన్ కల్యాణ్. రెండు... పవన్ కల్యాణ్. మూడు... పవన్ కల్యాణ్. ఇంకేం మాట్లాడతాను నేను! ఇప్పుడు నిజంగా మాట్లాడుతున్నాను.. త్రివిక్రమ్-పవన్ కల్యాణ్ కాంబినేషన్ చిత్రంలో నేను వేషం వేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ సినిమా ఓ చరిత్ర సృష్టిస్తుంది' అన్నారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ గురించి భరణి ఓ చిన్న కవిత చదివి వినిపించారు. ‘అతగాడు మితభాషి - నిత్య సత్యాన్వేషి - అర్జునుని వంటి ఒక అజ్ఞాతవాసి’ అని భరణి తన కవిత చదివి వినిపించగానే అభిమానుల చప్పట్లు మారుమోగిపోయాయి.
అంతకుముందు గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ కూర్చుని ఉండగా తాను మాట్లాడటమనేది సునామీలో పిల్లనగ్రోవి వాయించడం లాంటిదన్నారు. ఇది దర్శకుడు త్రివిక్రమ్ సంధించి విసిరిన కల్యాణాస్త్రం అని, పవనాస్త్రం అని.. ఈ సినిమా కలెక్షన్ల సునామీ సాధిస్తుందని కోరుకుంటున్నానని అన్నారు. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని, సంగీత దర్శకుడు అనిరుధ్‌కు తన శుభాకాంక్షలు చెబుతున్నానని అన్నారు.