Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'బాహుబలి-2' కలెక్షన్లను రైతులకెందుకివ్వాలి.. పైసా ఇవ్వొద్దు: తమ్మారెడ్డి భరద్వాజ

'బాహుబలి' చిత్ర ప్రదర్శన ద్వారా వచ్చిన కలెక్షన్ల సొమ్ములో రైతులకు ఎందుకివ్వాలంటూ ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ప్రశ్నించారు. ఇదే అంశంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు చేస్తున్న విమర్శలను ఆయన

'బాహుబలి-2' కలెక్షన్లను రైతులకెందుకివ్వాలి.. పైసా ఇవ్వొద్దు: తమ్మారెడ్డి భరద్వాజ
, బుధవారం, 3 మే 2017 (16:00 IST)
'బాహుబలి' చిత్ర ప్రదర్శన ద్వారా వచ్చిన కలెక్షన్ల సొమ్ములో రైతులకు ఎందుకివ్వాలంటూ ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ప్రశ్నించారు. ఇదే అంశంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు చేస్తున్న విమర్శలను ఆయన తనదైనశైలిలో స్పందించారు. రైతులకు, సినిమా కలెక్షన్లకు ముడిపెట్టి మాట్లాడాన్ని తప్పుబట్టారు. ఇలాంటి పోస్టు పెట్టడం ధర్మం కాదన్నారు. 
 
'బాహుబలి-2' సినిమా రిలీజైన తర్వాత సోషల్ మీడియాలో రైతుల కష్టాలకు, బాహుబలి-2 కలెక్షన్లకు లింకు పెడుతూ కొన్ని పోస్టులు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. వీటిపై ఆయన స్పందించారు. బాహుబలి చాలా కష్టపడి తీశారు కాబట్టి వారి కష్టాన్ని గౌరవించి మేము సినిమా చూశాం కాబట్టి దానికి రూ.వెయ్యి కోట్లు వస్తాయి కాబట్టి రైతులు కూడా కష్టపడుతున్నారు కాబట్టి దాంట్లో నుండి వంద కోట్లు రైతులకు ఇవ్వాలని... ఒకాయన ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు, ఆయన చెప్పంది వినడానికి బావుంది అంటూనే.... తమ్మారెడ్డి తనదైన రీతిలో కౌంటర్ వేశారు.
 
బాహుబలి కష్టపడి తీశారని అంటున్నారు... మరి మనం ఆ సినిమా తీసినవారి మీద జాలి పడ్డామో? సినిమా మనకు నచ్చిందో? అందరూ చూస్తున్నారు మనం చూడక పోతే తప్పు అనుకున్నామో? మొత్తానికి వెళ్లి చూశా.... అంత వరకు తప్పులేదు. అది చూసి రైతులకు డబ్బులు ఇవ్వాలని అనడం ఎందుకు? అలా అనడం ముమ్మాటికీ తప్పే అని తమ్మారెడ్డి అన్నారు.
 
రైతులు మీరు పుట్టక ముందు నుండీ, నేను పుట్టక ముందు నుండీ, భూమి పుట్టినప్పటి నుండి వారు వ్యవసాయం చేసుకుంటూనే ఉన్నారు. ఇపుడు వాళ్లకి గిట్టుబాట ధర లభించడం లేదు. మనలో చాలా మంది వ్యవసాయం వదిలిపెట్టి సిటీకి వలస వచ్చిన వాళ్లం ఉన్నాం. వ్యవసాయం చేయని వాళ్లం ఉన్నాం. కష్టపడి తీశారు కాబట్టి జాలిపడి సినిమా చూసామని చెబుతున్న వారంతా రైతు మీద ఎందుకు జాలి పడటం లేదని ప్రశ్నించారు. ఒక సినిమా హిట్ కావడం వల్ల వచ్చిన కోట్లాది రూపాయల్లో కొంతం రైతులకు ఇవ్వాలని చెప్పడం భావ్యం కాదని తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్నయ్య అంటూ ఫ్రెండ్ శ్రవణ్‌తో చనువుగా ఉన్న పావని.. టీవీ నటుడు ప్రదీప్ సూసైడ్‌ కేసులో మలుపు