Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగమెరిగిన గాయకుడు.. గంటసేపు పాడి వెళ్లిపోయాడు. రెండు భాషల మధ్య యుద్దం నడుస్తూనే ఉంది

పుట్టడం తమిళుడిగా పుట్టినా భారతీయ చలనచిత్ర రంగంలో ఆయన స్వరకల్పన చేయని భాష లేదు. దక్షిణాదిలో చిన్న స్థాయిలో మొదలైన ఆయన ప్రస్థానం మణిరత్నం తీసిన రోజా చిత్రంతో జాతీయ వ్యాప్తంగా మార్మోగిపోయింది. ఇక లగాన్, స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రాలకు స్వరకల్పన చేయడంతో

జగమెరిగిన గాయకుడు.. గంటసేపు పాడి వెళ్లిపోయాడు. రెండు భాషల మధ్య యుద్దం నడుస్తూనే ఉంది
హైదరాబాద్ , శనివారం, 15 జులై 2017 (07:46 IST)
పుట్టడం తమిళుడిగా పుట్టినా భారతీయ చలనచిత్ర రంగంలో ఆయన స్వరకల్పన చేయని భాష లేదు. దక్షిణాదిలో చిన్న స్థాయిలో మొదలైన ఆయన ప్రస్థానం మణిరత్నం తీసిన రోజా చిత్రంతో జాతీయ వ్యాప్తంగా మార్మోగిపోయింది. ఇక లగాన్, స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రాలకు స్వరకల్పన చేయడంతో జాతీయ సరిహద్దులు కూడా చెరిగిపోయి ఆస్కార్ అవార్డు వరకూ దూసుకెళ్లాడు. తన పాతికేళ్లకుపైగా సంగీత దర్శకత్వ జీవితంలో ఎన్నడూ వివాదాల జోలికి వెళ్లింది లేదు. ఏ భాషలో స్వరకల్పన చేస్తే ఆ ప్రాంతం వారు అక్కున చేర్చుకోవడమే ఉంటుంది తప్ప ఏరోజు ఎవరితోనూ గొడవలేదు.

కానీ నిన్నగాక మొన్న ఒక తమిళ ప్రోగ్రాం నిర్వహించి గంటసేపు తమిళ గీతాలు పాడారు. అంతే అగ్గి అంటుకుంది. అన్నీ తమిళపాటలే పాడారే హిందీలో పాడాలనిపించలేదా అంటూ హిందీ ప్రాంత అభిమానులు గయ్ మన్నారు. ప్రోగ్రామే తమిళం అయినప్పడు గంటసేపు మా పాటల్ని భరించలేకపోయారా అంటూ తమిళ అభిమానులు రెచ్చిపోయారు. ఇంకేం రెండు రోజులుగా దేశంలో  రెండు భాషాప్రాంత అభిమానుల మధ్య రావణకాష్టం రగులుతూనే ఉంది.
 
స్వర మాంత్రికుడు, ఆస్కార్‌ అవార్డు విజేత ఏఆర్‌ రెహమాన్‌ నిర్వహించిన కచేరి భాషా విభేదాలు తీసుకొచ్చింది. ఆయన మొత్తం తమిళ పాటలే పాడారంటూ హిందీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయగా అంతే స్థాయిలో తమిళులు రెహమాన్‌కు అండగా నిలిచారు. తమ తమిళ గీతాలను ఒక గంట భరించలేకపోయారా అంటూ మండిపడ్డారు. ఒక తమిళ ప్రోగ్రాం నిర్వహించి అందులో ఓ గంటపాటు ఏఆర్ రెహమాన్‌ తమిళ గీతాలు పాడితే వాటిని కూడా ఓర్చుకోలేకపోయారంటూ ఓ తమిళ అభిమాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
దక్షిణాదిపై బలవంతంగా హిందీ రుద్దుతున్నప్పుడు మీరంతా ఎక్కడికి పోయారని, ఆ సమయంలో ఇప్పుడు మీరు ప్రదర్శిస్తున్న అసహనం ఎక్కడికిపోయిందంటూ మరో తమిళ అభిమాని ప్రశ్నించారు. అంతేకాదు, ఏఆర్ రెహమాన్‌ తమిళ్ వారని, ఆయనకు తమ వద్ద నుంచే పేరు వచ్చిందని, ఈ విషయాన్ని హిందీవాళ్లు గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. 
 
దసరా సమయంలో మైసూరులో హిందీ పాటలను విన్నప్పుడు, విమానాల్లో హిందీలో ప్రకటనలు విన్నప్పుడు తమకూ ఇలాగే అనిపిస్తుంటుందని మరో అభిమాని అన్నాడు. ఇలా సోషల్‌ మీడియాలో తమిళులు, హిందీ అభిమానులు పోరుబాటకు దిగారు. అసలు విషయం ఏమిటంటే వాళ్లూ, వీళ్లూ ఆన్‌లైన్‌లో కొట్టుకుని చస్తున్నా ఈ వివాదంపై మాత్రం రెహమాన్‌ ఇంకా స్పందించలేదు.
 
బహుశా ఏ రికార్డింగు థియేటర్లోనూ, ఏ భాషలోనో తనకు నచ్చిన పాటను స్వరకల్పన చేస్తూ ఉండవచ్చు మరి. తనకు ఏ భేదాలూ లేవు. తెలీవు కూడా. కానీ వాళ్లూ వీళ్లూ ఎందుకు కొట్టుకుంటున్నట్లో..?
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీరు ఎన్నయినా రాసుకోండి.. అగ్రహీరోలతో నటిస్తూనే ఉంటా.. నన్నేం పీకలేరంటున్న చందమామ