Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీరు ఎన్నయినా రాసుకోండి.. అగ్రహీరోలతో నటిస్తూనే ఉంటా.. నన్నేం పీకలేరంటున్న చందమామ

సినిమా పరిశ్రమలోకి వచ్చి పదేళ్లకు పైబడినా ఇప్పటికీ దక్షిణాది అగ్రహీరోల సరసన నటిస్తూనే ఉండటం నా అదృష్టమని నటి కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు. తెలుగు తమిళ చిత్రరంగంలో వరుసగా స్టార్ హీరోలతో జతకడుతున్న నటి కాజల్. అటు తెలుగులో, ఇటు తమిళంలో మరోవైపు హిందీలోనూ

Advertiesment
మీరు ఎన్నయినా రాసుకోండి.. అగ్రహీరోలతో నటిస్తూనే ఉంటా.. నన్నేం పీకలేరంటున్న చందమామ
హైదరాబాద్ , శనివారం, 15 జులై 2017 (03:24 IST)
సినిమా పరిశ్రమలోకి వచ్చి పదేళ్లకు పైబడినా ఇప్పటికీ దక్షిణాది అగ్రహీరోల సరసన నటిస్తూనే ఉండటం నా అదృష్టమని నటి కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు. తెలుగు తమిళ చిత్రరంగంలో వరుసగా స్టార్ హీరోలతో జతకడుతున్న నటి కాజల్. అటు తెలుగులో, ఇటు తమిళంలో మరోవైపు హిందీలోనూ అవకాశాలు ఆమె వెన్నంటి వస్తున్నాయి. కోలీవుడ్‌లో విజయ్, అజిత్ వంటి స్టార్ హీరోలతో ఒకే సమయంలో నటిస్తున్న కాజల్ తెలుగులో నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో రానా సరసన నటించారు. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైవున సన్నిడియోల్‌తో హిందీలో నటించే చాన్స్ కూడా కొట్టేసిందని వార్తలు.  
 
ఇవన్నీ బాగున్నాయి కానీ ఇటీవల ఈ శ్వేత సుందరిపై వరుస పుకార్లు రావడం విశేషం. ఒక ఇంటర్వ్యూలో పొరపాటున తాను ప్రేమ వివాహమే చేసుకుంటానని నోరు జారి చెప్పిన పాపానికి కాజల్‌ ప్రేమలో పడ్డారని మీడియా ఆరున్నొక్క రాగంలో ప్రచారం చేసిపడేసింది. తనకు కాబోయే వరుడు సినిమా రంగానికి చెందిన వాడైనా లేదా మరే ఇతర రంగాలకు చెందిన వాడైనా పర్వాలేదనీ, తను అందంగా లేకపోయినా పర్వాలేదు గానీ కచ్చితంగా ఆరడుగుల పొడవాటి వాడై ఉండాలని కాజల్ పేర్కొనడం ఆమెపై రూమర్లను మరింత పెంచింది.
 
ఒక ప్రముఖ టాలీవుడ్ నటుడితో తరచూ రహస్యంగా కలుసుకుంటున్నారనీ టాక్. అదే విధంగా ఇటీవల అందానికి మెరుగులు దిద్దుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారనే ప్రచారం హల్‌చల్‌ చేసింది. ఇలాంటివి కాజల్‌ను కలతకు గురిచేశాయట. దీంతో ఈ అమ్మడు కాస్త ఘాటుగానే స్పందించారు. తన ఎదుగుదలను ఓర్వలేని వారే ఇలాంటి దుష్పచారాన్ని చేస్తున్నారు. ఇదంతా వారు తనపై పన్నుతున్న కుట్ర అని నటి ఆరోపించారు. 
 
తన ప్రేమ గురించి, పెళ్లి గురించి ఇలా పుకార్లమీద పుకార్లు వ్యాపిస్తుండటంతో కాజల్ ఒక రేంజిలో మండిపడుతోంది. ‘నాపై కుట్రలు పన్నుతున్నారు. అయితే, అవి నన్నేమీ చేయలేవు. నా స్థాయిని ఎవరూ కదిలించలేరు' అంటోందీ భామ. వారి కుట్రలు పారవనీ, మరి కొన్నేళ్ల వరకూ తాను అగ్రహీరోలతోనే నటిస్తాననీ కాజల్ అన్నారు. తన స్థానాన్ని ఎవరూ కదిలించలేరు అనే ధీమాను వ్యక్తం చేశారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అబద్ధాలు చెప్పినవాళ్లను వదలడు ఆ గుడిలో దేవుడు... ఏ దేవుడు?