Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎంజీఆర్ టైటిల్.. చిన్నమ్మకు రానా ఝలక్.. రెస్టారెంట్లో వందమంది ఎమ్మెల్యేలను కూర్చోబెడితే...?

బాహుబలి సినిమాతో మంచి క్రేజ్ కొట్టేసిన రానా తాజాగా నేనే రాజు, నేనే మంత్రి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా తమిళంలో ''నాన్ ఆనైఇట్టాల్'' పేరుతో రిలీజ్ అవుతుంది. తెలుగులో నేనే రాజు

ఎంజీఆర్ టైటిల్.. చిన్నమ్మకు రానా ఝలక్.. రెస్టారెంట్లో వందమంది ఎమ్మెల్యేలను కూర్చోబెడితే...?
, మంగళవారం, 11 జులై 2017 (15:13 IST)
బాహుబలి సినిమాతో మంచి క్రేజ్ కొట్టేసిన రానా తాజాగా నేనే రాజు, నేనే మంత్రి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా తమిళంలో ''నాన్ ఆనైఇట్టాల్'' పేరుతో రిలీజ్ అవుతుంది. తెలుగులో నేనే రాజు నేనే మంత్రి సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా.. తమిళంలో ట్రైలర్ విడుదలైంది. తేజ దర్శకత్వంలో రానా నేనే రాజు నేనే మంత్రి సినిమా తెలుగుతోపాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా విడుదల కాబోతోంది. 
 
ఇటీవల విడుదల చేసిన తమిళ టీజర్‌లోని ఓ డైలాగ్‌ పట్ల తమిళ రాజకీయ నాయకుల మధ్య ఆసక్తిని పెంచుతుంది. వంది మంది ఎమ్మెల్యేలను ఓ రిసార్ట్‌లో కూర్చోబెడితే నేను కూడా సీఎంనే.. అంటూ రానా చెప్పిన డైలాగ్ తమిళ రాజకీయాల్లో చర్చకు కారణమవుతోంది. పైగా ఈ సినిమాకు తమిళనాడు మాజీ సీఎం ఎంజీయార్‌ సినిమాలోని హిట్‌ సాంగ్‌ అయిన ‘నాన్‌ అనైయిట్టాల్‌’ పదాన్ని టైటిల్‌గా పెట్టారు. దీంతో తమిళ జనాలకు ఆసక్తి పెరిగింది. ఇప్పటికే దివంగత ముఖ్యమంత్రి జయలలితకు తర్వాత తమిళనాడులో పలు రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
 
అన్నాడీఎంకే రెబెల్ పన్నీర్ సెల్వం పార్టీ నుంచి బయటికొచ్చి.. చిన్నమ్మపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. దీంతో అన్నాడీఎంకే వర్గాలుగా చీలిపోయింది. పన్నీర్, శశికళ వర్గంగా మారింది. ఆపై బలపరీక్ష కోసం చిన్నమ్మ రెస్టారెంట్‌లో ఎమ్మెల్యేలను నిర్భంధించి పళనిసామిని సీఎం చేసిన సంగతి తెలిసిందే. ఇలా రెస్టారెంట్లో ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి ఎడప్పాడి పళనిసామిని సీఎం చేయడంపై సర్వత్రా విమర్శలొచ్చాయి. తాజాగా రానా కూడా చిన్నమ్మకు ఝలక్ ఇచ్చేలా తన సినిమాలో డైలాగ్ పేల్చాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అది నచ్చితే ఎంతసేపయినా ఓకే... రాశీ ఖన్నా