Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెబ్ సిరీస్ కోసం హద్దులు దాటేసిన మిల్కీ బ్యూటీ

Advertiesment
tamannah
, గురువారం, 15 జూన్ 2023 (20:55 IST)
కెరీర్‌ ప్రారంభంలో కొందరు నటులు తమకి తాము కొన్ని షరతులు పెట్టుకుంటారు. ఫలానా సన్నివేశాల్లో నటించకూడదని, ఫలానా డ్రెస్సులు వేసుకోకూడదని నిర్ణయించుకుంటారు. కానీ, అనుభవం పెరిగే కొద్దీ, పరిస్థితుల దృష్ట్యా తమ నిబంధనలను పక్కన పెడతారు. తెలుగు హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా విషయంలో ఇదే జరిగింది. తాను పెట్టుకున్న ‘నో కిస్సింగ్‌’ రూల్‌ని 18 ఏళ్ల తర్వాత బ్రేక్‌ చేసింది. ‘లస్ట్‌ స్టోరీస్‌ 2’ కోసం ముద్దు సన్నివేశాలకు ఓకే చెప్పింది. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఓ ఇంటర్వ్యూలో వివరించింది.
 
ప్రేక్షకులను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతోనే తాను ఇన్నాళ్లు అలాంటి సన్నివేశాల్లో నటించలేదన్న తమన్నా.. కాలానికి తగ్గట్టు కొన్ని మార్పులు అంగీకరించాల్సి వస్తుంది అభిప్రాయపడింది. 'ఒకప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు వేరు. కాలానికి అనుగుణంగా మారే వ్యక్తుల్లో నేనూ ఒకదాన్ని. భారత్‌లో అనేక రకాల ప్రేక్షకులున్నారు. 
 
చాలా విషయాల్లో ఇప్పటికీ మార్పులు రావాల్సి ఉంది. అయితే, అదృష్టవశాత్తూ ఇంటర్నెట్‌, సోషల్‌ మీడియా కారణంగా సమాచారం అనేది ప్రతి ఒక్కరి చేతిలో ఉంటోంది. ప్రతి ఒక్కరూ ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతున్నారు. ఒక నటిగా సృజనాత్మకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నా. సినీ ఇండస్ట్రీకి వచ్చిన 18 ఏళ్ల తర్వాత ఫేమస్‌ అవ్వాల్సిన అవసరం నాకు లేదు. నా ఉద్దేశం కూడా అది కాదు' అని తెలిపింది.
 
గతంలో విడుదలై ప్రేక్షకాదరణ పొందిన ‘లస్ట్‌ స్టోరీస్‌’కి సీక్వెల్‌గా రూపొందిందే ‘లస్ట్‌ స్టోరీస్‌ 2’. నాలుగు భాగాలుగా ఉండే ఈ మూవీకి ఆర్‌. బాల్కి, కోన్‌కోన సేన్‌ శర్మ, అమిత్‌ రవీంద్రనాథ్‌ శర్మ, సుజోయ్‌ ఘోష్‌ దర్శకత్వం వహించారు. అమృత సుభాష్‌, కాజోల్‌, మృణాల్‌ ఠాకూర్‌, నీనా గుప్త తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇది ఈ నెల 29న ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌‌లో విడుదల కానుంది. 
 
ఇందులో మరో ప్రధాన పాత్ర పోషించిన విజయ్‌ వర్మతో తమన్నా సన్నిహితంగా ఉంటుందంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. దానిపై స్పందించిన ఆమె.. తనకోసం సృష్టించుకున్న ప్రపంచంలోకి విజయ్‌ వర్మ వచ్చాడని చెప్పింది. తనను శ్రద్ధగా చూసుకుంటాడని చెబుతూ అతడితో రిలేషన్‌లో ఉన్నట్లు కన్ఫామ్‌ చేసింది. 
 
మరోవైపు, తమన్నా నటించిన ‘జీ కర్దా’ వెబ్‌ సిరీస్‌.. ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. అందులో ఆమె శృంగార సన్నివేశాల్లో కనిపించిందంటూ.. సంబంధిత స్క్రీన్‌ షాట్లను కొందరు నెటిజన్లు ట్విటర్‌లో పోస్ట్‌ చేసి ట్రోల్‌ చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వేల సంఖ్యలో 'ఆదిపురుష్' టిక్కెట్ల కొనుగోలు.. ఉచితంగా పంపిణీ .. ఎక్కడ?