Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అందాన్ని ఎరగా వేస్తే తమన్నాను బాహుబలి కూడా కాపాడలేదు.. బాలీవుడ్‌లో ఏటి కెదురీదుతున్న మిల్కీ బ్యూటీ

బాహుబలి సినిమా చేస్తూనే ఇటు తెలుగు, తమిళంతోపాటు బాలీవుడ్‌లో కూడా ఒక కాలు వేసిన పాలనురుగు తమన్నా కెరీర్ సక్సెస్ పరంగా ఇంకా దోబూచులాడుతూనే ఉంది. దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో నటిస్తూనే మాతృ భాష హిందీలో కూడా పట్టు సాధించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ వస్తోం

Advertiesment
Tamanna
హైదరాబాద్ , శుక్రవారం, 5 మే 2017 (03:06 IST)
బాహుబలి సినిమా చేస్తూనే ఇటు తెలుగు, తమిళంతోపాటు బాలీవుడ్‌లో కూడా ఒక కాలు వేసిన పాలనురుగు తమన్నా కెరీర్ సక్సెస్ పరంగా ఇంకా దోబూచులాడుతూనే ఉంది. దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో నటిస్తూనే మాతృ భాష హిందీలో కూడా పట్టు సాధించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ వస్తోంది. అయినప్పటికీ తాను హిందీలో నటించిన హింసక్కల్, హిమత్వాలా వంటి చిత్రాలు ఆశించిన స్థాయిలో తమన్నాకు పేరు తెచ్చిపెట్టలేకపోయాయి. 
 
అయితే ప్రభుదేవాతో తమిళం, తెలుగు, హిందీ అంటూ మూడు భాషల్లో నటించిన ‘దేవి’ చిత్రం హిందీలో విజయాన్ని అదించింది. దీంతో తమన్నాకు రెండు కొత్త సినిమాల్లో మంచి అవకాశాలు లభించాయి. అంతేకాకుండా తమిళంలో నయనతార నటిస్తున్న ‘కొలైయుదిర్‌కాలం’ చిత్రం హిందీలో నయన పాత్రలో తమన్నా నటిస్తోంది. 
 
బాహుబలి తర్వాత వస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని హిందీ సినిమాల్లో కూడా కలల రాణిగా మారడానికి తమన్నా అక్కడే మకాం వేసి కథలు వింటోంది. అదే సమయంలో అందచందాల ప్రదర్శనను పక్కన పెట్టి, నటనకు మంచి స్కోప్‌ ఉన్న పాత్రలను పసిగట్టే పనిలో పడింది తమన్నా. సినీరంగంలోకి అడుగుపెట్టి పదేళ్లు కావస్తున్నా అందంతోనే నెట్టుకొస్తున్న తమన్నా ఇకనైనా కథా బలమున్న చిత్రాల వైపుకు వెళ్లకపోతే కెరీక్ ఎక్కువ కాలం కొనసాగదని సినీ పండితుల సూచన.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆరు రోజుల్లో బాహుబలి 2 కలెక్షన్లు రూ. 792.. అమీర్ పీకే అవుట్.. 1,500 కోట్ల వసూళ్లపై కన్ను.. నోటమాట రాని బాలీవుడ్