Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టికెట్ రేట్లు పెంచడంకంటే కంటెంట్ చిత్రాలు తీయండి : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Advertiesment
Komatireddy Venkata Reddy launched the LYF teaser

డీవీ

, శనివారం, 25 జనవరి 2025 (19:53 IST)
Komatireddy Venkata Reddy launched the LYF teaser
ఎక్కువ బడ్జెట్ పెట్టి తర్వాత టికెట్ రేట్లు పెంచాలని ప్రభుత్వాన్ని అడగడం కంటే తక్కువ బడ్జెట్లో మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం మంచిది అని తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
 
శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా నటిస్తూ మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, అన్నపరెడ్డి స్టూడియోస్ బ్యానర్లపై కిషోర్ రాటి, మహేష్ రాటి, ఏ రామస్వామి రెడ్డి నిర్మాతలుగా పవన్ కేతరాజు దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఎల్ వై ఎఫ్. ఎస్పీ చరణ్, ప్రవీణ్, భద్రం, నవాబ్ షా, షకలక శంకర్, రవిబాబు, రియా, సంధ్య తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. కథ తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ చిత్ర టీజర్ విడుదల చేయడం జరిగింది.
 
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.... "శ్రీహర్ష, కషిక కపూర్ యువ జంటగా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం ఎల్ వై ఎఫ్. మంచి కథతో వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయాన్ని సాధించాలి అని కోరుకుంటున్నాను. తీసే సినిమాలు ఎక్కువ బడ్జెట్లో కాకుండా మంచి కంటెంట్ తో తక్కువ బడ్జెట్ తో ఉంటే సినిమాలు బాగుంటాయి. ఈ ఎల్ వై ఎఫ్ అనే చిత్రం అలా తక్కువ బడ్జెట్లో మంచి కంటెంట్ తో వస్తున్న చిత్రం. ఇటువంటి చిత్రాలను ప్రోత్సహించడంలో సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా నేను ముందుంటాను. ఓటిటిలో అయినా థియేటర్లో అయినా తక్కువ బడ్జెట్ తో వచ్చే చిన్న సినిమాలు మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. కొత్త సినిమాలతో పోటీపడుతూ కలెక్షన్స్ వసూలు చేస్తున్నాయి. ఈ చిత్రం కూడా అదే విధంగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను" అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కానిస్టేబుల్స్ అంటే నాకు చాలా ఇష్టం : కమీషనర్ సి.వి.ఆనంద్