Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 29 April 2025
webdunia

నాగ్ నుంచి అఖిల్ దాకా.. ఆ కుటుంబంలో ఎవరినీ వదలని పొడుగాటి సుందరి

దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో మెరుపులా మెరిసి ప్రస్తుతం బాలీవుడ్‌కి పరిమితమైన పొడుగుకాళ్ల సుందరి టబు టాలీవుడ్‌లో నాగార్జున సరసన నిన్నే పెళ్లాడుతా సినిమాలో నటించి ప్రేమికుల హృదయాలను కొల్లగొట్టింది. ప్రేమలోని సున్నితభావాన్ని, కుటుంబ బంధాల గొప్పతనాన్ని అ

Advertiesment
Tabu
హైదరాబాద్ , శుక్రవారం, 2 జూన్ 2017 (04:15 IST)
దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో మెరుపులా మెరిసి ప్రస్తుతం బాలీవుడ్‌కి పరిమితమైన పొడుగుకాళ్ల సుందరి టబు టాలీవుడ్‌లో నాగార్జున సరసన నిన్నే పెళ్లాడుతా సినిమాలో నటించి ప్రేమికుల హృదయాలను కొల్లగొట్టింది. ప్రేమలోని సున్నితభావాన్ని, కుటుంబ బంధాల గొప్పతనాన్ని అజరామరంగా చిత్రించిన ఆ సినిమా నాగార్జున చిత్రాల్లో అద్భుత ప్రేమ చిత్రంగా మిగిలిపోయింది. ఇక టబు అయితే ఆనాటినుంచి నేటివరకూ నాగ్ ప్యామిలీకి అత్యంత సన్నిహితురాలిగా మారిపోయింది. 
 
తండ్రితో ప్రేమరసాన్ని చిరస్మరణీయంగా అభినయించిన అందాల టబు ఇప్పుడు ఆ తండ్రి కుమారుడు అఖిల్‌ సినిమాలో నటించడానికి సిద్ధమైపోయింది. అఖిల్ బాలనటుడిగా తెరకెక్కిన సిసింద్రీ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన టబు, ఇప్పుడు అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ చేస్తోంది. అయితే టబు చేస్తుంది తల్లి పాత్రే అయినా..అది హీరో తల్లి పాత్రనా.. లేక హీరోయిన్ తల్లి పాత్రనా తెలియాల్సి ఉంది.
 
తొలి సినిమాతో నిరాశపరిచిన అఖిల్ రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలో ప్రారంభం కానున్న రెండో షెడ్యూల్‌లో టబు పై సన్నివేశాలను చిత్రీకరించేలా ప్లాన్ చేస్తున్నారు.  మనం, 24 సినిమాల ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకక్కుతున్న ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది.
 
తెలుగు సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన టబు, తరువాత బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. గతంలో నాగ్ సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన ఈ బ్యూటి అక్కినేని కుటుంబంతో మంచి రిలేషన్ మెయిన్‌టైన్ చేస్తున్న విషయం తెలిసిందే.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహేష్ బాబుకు రాజమౌళి ఫీవర్... జక్కన్నను కలిస్తే ఆ మాటన్నాడట...