కొబ్బరి చిప్పను బొడ్డు మీద వేయడం రాఘవేంద్ర రావు సృజనాత్మక అని తెలియదు : తాప్సీ
కొబ్బరి చిప్పను బొడ్డుపై వేయడం దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సృజనాత్మక అని తనకు తెలియదని సినీ నటి తాప్సీ వ్యాఖ్యానించింది. 'కొబ్బరిచిప్పను బొడ్డు మీద వేయడంలో శృంగారం ఏముందోననే విషయం నాకు ఇప్పటికీ
కొబ్బరి చిప్పను బొడ్డుపై వేయడం దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సృజనాత్మక అని తనకు తెలియదని సినీ నటి తాప్సీ వ్యాఖ్యానించింది. 'కొబ్బరిచిప్పను బొడ్డు మీద వేయడంలో శృంగారం ఏముందోననే విషయం నాకు ఇప్పటికీ అర్థం కాలేదు' అంటూ ఓ యూట్యూబ్ కామెడీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి తాప్సీ వ్యాఖ్యానించింది.
ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా తొలి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకుడి గురించి ఇలా మాట్లాడతావా అంటూ నెటిజన్లు తాప్సీపై మండిపడుతున్నారు. 'నీకు విశ్వాసం లేదు... నువ్వు బాలీవుడ్ వెళ్లింది దక్షిణాది సినిమాల వల్లనే అనే విషయం గుర్తుపెట్టుకో' అంటూ చాలా మంది విమర్శించారు.
వీటిపై తాప్సీ వివరణ ఇచ్చింది. తొలి చిత్రం కావడం వల్ల దక్షిణాది దర్శకుల సృజనాత్మకత తనకు అర్థం కాలేదని, రొమాన్స్‌ను ఇలా కూడా చూపిస్తారా? అని మాత్రమే వ్యాఖ్యానించినట్టు చెప్పారు. ముఖ్యంగా 'రాఘవేంద్రరావుగారు చేసిందే నేను చెప్పాను. నాకు అలా అనిపించేంది చెప్పేశాను. ఈ విషయంపై ఆయన గానీ, నేను గానీ ఏ బాధ పడలేదు సరికదా వీడియో చూసి నవ్వుకున్నాం. అనవసరంగా ఆ విషయాన్ని మధ్యలో వాళ్లే వివాదం చేస్తున్నారు. అలాంటి వాళ్లని మేం పట్టించుకోం' తాప్సీ స్పష్టం చేసింది.