Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేను చనిపోయేలోపు మెగా ఫ్యామిలీ హీరోలతో మల్టీస్టార్ మూవీ : టి సుబ్బరామరెడ్డి

మెగా ఫ్యామిలీ హీరోలందరితో కలిసి ఒక చిత్రాన్ని తీస్తానని టాలీవుడ్ నిర్మాత కళాబంధు టి సుబ్బరామిరెడ్డి ప్రకటించారు. ఈ లక్ష్యాన్ని త్వరలోనే పూర్తి చేస్తానని తెలిపారు. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, పవర్

Advertiesment
నేను చనిపోయేలోపు మెగా ఫ్యామిలీ హీరోలతో మల్టీస్టార్ మూవీ : టి సుబ్బరామరెడ్డి
, సోమవారం, 9 జనవరి 2017 (08:43 IST)
మెగా ఫ్యామిలీ హీరోలందరితో కలిసి ఒక చిత్రాన్ని తీస్తానని టాలీవుడ్ నిర్మాత కళాబంధు టి సుబ్బరామిరెడ్డి ప్రకటించారు. ఈ లక్ష్యాన్ని త్వరలోనే పూర్తి చేస్తానని తెలిపారు. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లు ప్రధాన పాత్రధారులుగా ఉంటారని, చెర్రీ, బన్నీలు చిన్న పాత్రలను పోషిస్తారనని చెప్పారు.
 
గుంటూరు వేదికగా జరిగిన ఖైదీ నంబర్ 150 చిత్ర ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో ఆయన పాల్గొని మాట్లాడుతూ... మెగా హీరోలందరితో సినిమాలు తీయడమే తన లక్ష్యమన్నారు. తాను తీసే చిత్రంలో నటించేందుకు చిరంజీవి ఇప్పటికే అంగీకరించారని, పవన్ కల్యాణ్ నుంచి డేట్స్ ఫైనల్ కావాల్సి ఉందని అన్నారు. 
 
ఈ సినిమాలో రాంచరణ్, బన్నీ కూడా ముఖ్యపాత్రలు పోషిస్తారని, ‘విశాఖ’ చుట్టూ కథ తిరిగేలా స్క్రిప్ట్ రూపొందిస్తున్నామన్నారు. గతంలో వచ్చిన ‘స్టేట్‌రౌడీ’, ‘జీవనపోరాటం’ సినిమాల కంటే త్వరలో తీయబోయే ఈ సినిమా భారీ హిట్ అవుతుందని ఆశిస్తున్నామని సుబ్బరామిరెడ్డి నమ్మకం వ్యక్తం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పంచభక్ష్యపరమాన్నాలతో కూడిన విందుభోజనంలా 'గౌతమిపుత్ర' : బాలకృష్ణ