Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్వాతి హత్య కేసుపై సినిమా.. ట్రైలర్ రిలీజ్.. నిజాలేంటో తెలుసా? (video)

తమిళనాడులో సంచలనం సృష్టించిన స్వాతి హత్య కేసుపై సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా సంబంధించిన ట్రైలర్‌ను ఇప్పటికే విడుదల చేశారు. ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చెన్నై నుంగంబాక్కం రైల్వే స్టేష

స్వాతి హత్య కేసుపై సినిమా.. ట్రైలర్ రిలీజ్.. నిజాలేంటో తెలుసా? (video)
, బుధవారం, 31 మే 2017 (11:03 IST)
తమిళనాడులో సంచలనం సృష్టించిన స్వాతి హత్య కేసుపై సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా సంబంధించిన ట్రైలర్‌ను ఇప్పటికే విడుదల చేశారు. ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చెన్నై నుంగంబాక్కం రైల్వే స్టేషన్లో దారుణంగా హత్యకు గురైన స్వాతి కేసుపై ప్రజలకు ఎన్నో అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై "స్వాతి కొలై వళక్కు" పేరిట సినిమాకు ఆర్డీ రమేష్ సెల్వన్ దర్శకత్వం వహిస్తున్నారు. 
 
తమిళ రాష్ట్రంలో సెన్సేషనల్ కేసుగా నిలిచిన స్వాతి హత్య కేసు ప్రస్తుతం వెండితెరపై రానుందంటూ ఆర్డీ రమేష్ సెల్వన్ ప్రకటించారు. ఇందులో భాగంగా ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. ఎప్పట్నుంచో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను చాలా రహస్యంగా చిత్రీకరించారు. త్వరలో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రసాద్‌ ల్యాబ్‌ థియేటర్‌లో ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్లో నిర్మాతల సంఘం అధ్యక్షుడు విశాల్‌, ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్‌కే సెల్వమణి, సీనియర్‌ దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ.. స్వాతి హత్య కేసుకు సంబంధించిన ఎన్నో రహస్యాలకు ఈ సినిమా సమాధానం లభిస్తుందని నమ్ముతున్నట్లు తెలిపారు. చిన్న సినిమాలకు థియేటర్లు కష్టంగా మారుతున్న పరిస్థితుల్లో ‘స్వాతి కొలై వళక్కు’ చిత్రం విడుదలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను నిర్మాతల సంఘం తరపున చేస్తామని హామీ ఇచ్చారు. యూట్యూబ్‌ ద్వారా కూడా నిర్మాతలకు ఆదాయం వస్తుందని, అయితే ఆ విషయం తెలియక చాలామంది నిర్మాతలు నష్టపోతున్నారన్నారు. 
 
విశాల్‌కు సినీ పరిశ్రమలో శత్రువులున్న మాట నిజమేనని.. మంచి పనులు చేసేవాళ్లకి శత్రువులు ఉండటం సహజమేనని తెలిపారు. తమిళ సినీ పరిశ్రమ మళ్లీ లాభదాయక పరిశ్రమగా మారాలని కృషి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. వచ్చే డిసెంబర్‌ తరువాత ఏ నిర్మాత కూడా థియేటర్లు దొరకలేదనో, నష్టపోయామనో బాధపడే పరిస్థితి ఉండకూడదన్న లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. 
 
దర్శకుడు మాట్లాడుతూ.. "యదార్థ సంఘటనల్ని, అందులోనూ సంచలనం సృష్టించిన అంశాలను తెరకెక్కించేటరప్పుడు కాల్పనిక సంఘటనల్ని జోడిస్తుంటారు. అయితే 'స్వాతి కొలై వళక్కు'లో అటువంటి సన్నివేశాలేమీ ఉండవని చెప్పారు. ఇక స్వాతి హత్య కేసుకు సంబంధించి జనానికి తెలీని చాలా విషయాలు ఈ చిత్రంలో ఉన్నాయి.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దాసరి నారాయణ రావు మా బంధువు.. వ్యక్తిగతంగా తీరని లోటు : పవన్ కళ్యాణ్