Cassette Govindu Movie opening
యాక్షన్ రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రం క్యాసెట్టు గోవిందు. విమల్, రవి అశోక్, కీర్తి లత తదితరులు నటిస్తున్న ఈ సినిమా సోమవారంనాడు రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ వీరశంకర్ క్లాప్ కొట్టగా, ఎస్.వికృష్ణారెడ్డి స్విచాన్ చేశారు. లక్ష్మి సౌజన్య స్క్రిప్ట్ అందజేశారు.
చిత్ర దర్శకుడు విరాజ్ మాట్లాడుతూ,. ఈరోజు లాంఛనంగా ప్రారంభించాం., ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్టర్ పొంగల్ నుంచి మొదలవుతుంది. మూవీ కథ అంత లవ్ అండ్ యాక్షన్ డ్రామా, ఎక్కడ కంప్రమైజ్ అవ్వకుండా ప్రొడ్యూసర్ మాకు సపోర్ట్ చేస్తున్నారు సినిమా పరం గా టెక్నికల్ గా కూడా ఎక్కువ స్పాన్ వున్న మూవీ గా తీద్దాం అని ట్రై చేస్తున్నాం అన్నారు.
సినిమాటోగ్రఫర్ అశోక్, మణిధర్, కీర్తిలత మాట్లాడుతూ, అందరు కొత్త వాళ్ళతో తీయబోయే మూవీని అందరూ మెచ్చేలా తీస్తామని పేర్కొన్నారు. ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి తీస్తున్న సినిమా క్యాసెట్టు గోవిందువిజయవంతం కావాలని అదిథులు ఆకాంక్షించారు.
ఈ చిత్రానికి సమర్పణ- కురుసం అనంత లక్ష్మి, ప్రొడ్యూసర్ :మణిధర్. కె, స్టోరీ -స్క్రీన్ ప్లే -డైరెక్షన్ :విరాజ్ వర్ధన్, మ్యూజిక్ :ఎలీషా ప్రవీణ్.