Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కంగువ డి.ఐ. పనులను పరిశీలించిన హీరో సూర్య

Advertiesment
Suriya, director siva in DI house

డీవీ

, బుధవారం, 14 ఫిబ్రవరి 2024 (17:22 IST)
Suriya, director siva in DI house
సూర్య కంగువ చిత్రం చారిత్రాత్మక నేపథ్యంలో కల్పిత కథతో రూపొందుతోంది. ముగింపు దశలో వున్న ఈ చిత్రం టీజర్ ఆమధ్య విడుదలై మంచి స్పందన రేకెత్తించింది. ప్రపంచ వ్యాప్తంగా 38 భాషల్లో.. 3డి, ఐమ్యాక్స్ ఫార్మాట్లలో ‘కంగువ’ విడుదల కానుందని నిర్మాతలు తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమా డి.ఐ. పనులు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా స్టూడియోలో సూర్య, దర్శకుడు శివ, కలరిస్ట్ రాజశేఖర్ తోపాటు డి.ఐ. సిబ్బంది వున్న ఫొటోను చిత్ర యూనిట్ షేర్ చేసింది.
 
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, దిశా పటాని - రెడిన్ కింగ్స్ - కోవై సరళ తదితరులు నటిస్తున్నారు. ఇందులో అఘోరా గా సూర్య నటిస్తున్నట్లు టీజర్ తెలియజేస్తుంది. సాంకేతికంగా హైలెవల్ లో ఈ సినిమా వుండబోతుందని దర్శకుడు శివ తెలియజేస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది  పాన్ వరల్డ్ సినిమాగా రూపొందనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మ‌న్మ‌థుడు ద‌ర్శ‌కుడు కె.విజ‌య్‌భాస్క‌ర్ ల‌వ్‌స్టోరి ఉషా ప‌రిణయం లుక్